రెడ్‌క్రాస్ సైకిల్ ర్యాలీకి సంఘీభావం తెలపాలి..


Ens Balu
1
Vijayawada
2021-03-17 20:04:34

రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 24వ తేది నిర్వహిస్తున్న శతవార్షికోత్సవ సైకిల్ ర్యాలీలో పాఠశాలలు, కళాశాల విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ర్యాలీ నిర్వాహణపై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, కలెక్టరు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ డా. జి. సమరం, జాయింట్ కలెక్టరు, రెడ్ క్రాస్ నోడల్ అధికారి కె. మోహన్‌కుమార్ , సెక్రటరీ డా. ఇళ్ల రవి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ 1920వ సంవత్సరంలో ఏర్పడిందన్నారు. కరోనా విపత్కర కాలం రావడంతో 2020వ సంవత్సరంలో నిర్వహించాల్సి సెంటీనియల్ వేడుకలను ఇప్పుడు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈర్యాలీ మార్చి 16 నాడు శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ప్రారంభ##మైందన్నారు. ఈర్యాలీ పలు జిల్లాల మీదుగా కృష్ణాజిల్లాలోకి 24వ తేది ఉదయం హనుమాన్‌జంక్షన్ వద్ద ప్రవేశిస్తుందన్నారు. ర్యాలీలో 70 మంది రెడ్ క్రాస్ కార్యకర్తలతోపాటు, వారికి సంఘీభావంగా బాపులపాడు లోని కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్ధులు ర్యాలీలో పాల్గొంటారన్నారు. అలాగే ర్యాలీలో పాల్గొన్నవారికి రోడ్డుకిరుప్రక్కలా విద్యార్ధులు నిలబడి అభివాదం తెలుపుతారన్నారు. విద్యార్ధులకు రెడ్ క్రాస్ సంస్ధ టీషర్ట్‌లు, టోపీలు, మాస్క్‌లు ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అక్కడి నుండి 25వ తేది ఉదయం విజయవాడ నగరంలోనికి ప్రవేశిస్తుందన్నారు. నెల్లూరు నుంచి వచ్చే మరో సైకిల్ ర్యాలీ 25వ తేది ఉదయం గుంటూరు నుండి జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. స్ధానిక యస్‌యస్ కన్వెషన్ హాలులో రెడ్ క్రాస్ సెంటీనియల్ సైకిల్ ర్యాలీ వేఢుకలు జరుగుతాయని ఆయన చెప్పారు. బ్లడ్ డొనేషన్, మొక్కలపెంపకం, పారిశుద్ధ్యం మూలసూత్రాలుగా ఈవేఢుకలు నిర్వహించాలన్నారు. ఈవేఢుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ గౌ. బిశ్వభూషణ్ హరిచందన్ హాజరై పాల్గొంటారన్నారు. ఈవేఢుకల నిర్వాహణలో ఎ లాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టరు రెడ్ క్రాస్ అధికారులను ఆదేశించారు.