ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాలి..


Ens Balu
1
Vizianagaram
2021-03-18 18:44:40

 క్రీడా పాఠ‌శాల‌లో అందించిన శిక్ష‌ణ‌ను స‌ద్వినియోగం చేసుకొని, ఉత్త‌మ క్రీడాకారులుగా ఎద‌గాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు కోరారు. స్థానిక విజ్జీ స్టేడియంలోని ఆద‌ర్శ క్రీడా పాఠ‌శాల పునః ప్రారంభ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. చ‌దువుతోపాటు క్రీడ‌ల్లో కూడా రాణించాల‌ని అన్నారు. 2019 పాఠ‌శాల ప్రారంభ‌మైన ఈ క్రీడా పాఠ‌శాల‌, కోవిడ్ కార‌ణంగా మూసివేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇప్పుడు పునః ప్రారంభం అవుతోంద‌ని, 82 మంది విద్యార్థులు ప్ర‌స్తుతం ఉన్నార‌ని తెలిపారు. పిల్ల‌ల‌కు ఆంగ్ల మాధ్య‌మ విద్యాబోధ‌న‌తోపాటుగా, మంచి భోజ‌న వ‌స‌తిని క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ముర‌ళి, క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు రాజు, క‌బ‌డ్డీ అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఈశ్వ‌ర్ కౌషిక్‌, సెట్విజ్ సిఇఓ నాగేశ్వ‌ర్రావు, తాశీల్దార్ ప్ర‌భాక‌ర్రావు, జిల్లా ఛీఫ్ కోచ్ వెంక‌టేశ్వ‌ర్రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.