మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం స్వర్ణ భారతి స్టేడియంలో ఎనిమిది మంది బాక్సింగ్ విజేతలకు మెడల్స్ అందజేసి వారిని అభినందించారు. జూలై 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని సోనీపుట్ లో జరిగిన సీనియర్, జూనియర్ నేషనల్ బాక్సింగ్ పోటీల్లో ఎనిమిది మంది విజయం సాధించి, మన జిల్లాకే కాకుండా, మన రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారని మేయర్ కొనియాడారు. ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు కలకత్తాలో జరగబోయే “చెస్ బాక్సింగ్” పోటీల్లో ఇరవై మంది బాల బాలికలు వెళుతున్న సందర్భంగా వారిని విజేతలుగా తిరిగి రావాలని మేయర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ ప్రెసిడెంట్ పి.రామకృష్ణారెడ్డి, విశాఖ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. అప్పల రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, నేషనల్ బాక్సింగ్ కోచ్ ఎన్. ఉష, 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మావతి, ఇతర బాక్సింగ్ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.