ఆరోగ్యభారత్ ప్రతీ ఒక్కరి లక్ష్యం కావాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-14 13:06:58

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ మార్చ్ 2.0' కార్యక్రమం లోగోను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రతిఒక్కరూ ఫిట్ నెస్ గా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడల శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో ప్రారంభించారు. విశాఖ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆగష్టు 13 నుంచి అక్టోబర్ 2 వరకూ దేశవ్యాప్తంగా జరుగనుంది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా "ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ " కార్యక్రమంలో భాగంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరైనా ఈ మార్చ్ లో పాల్గొని ఫిట్ నెస్ సాధించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి ఎన్. సూర్యారావు, క్రీడాకారులు పాల్గొన్నారు.