గ్రేటర్‌ అభివృద్ధిలో జర్నలిస్టులదే కీలక పాత్ర..


Ens Balu
1
Visakhapatnam
2021-09-21 07:59:05

మహా విశాఖ నగరాభివృద్ధిలో జర్నలిస్టలదే కీలకపాత్ర అని గ్రేటర్‌ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టుమూరి సతీష్‌లు అన్నారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫొరం-సిఎంఆర్‌,విస్జా నిర్వహిస్తున్న ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా మంగళవారం స్వర్ణభారతి స్టేడియంలో ఇండోర్‌ గేమ్స్‌ను డిప్యూటీ మేయర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. మూడు దశాబ్ధాలుకు పైగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ, ఇంటర్‌ మీడియాతో పాటు రాష్ట్ర స్ధాయి క్రీడలు నిర్వహించిన ఘనత వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరంకే దక్కుతుందన్నారు. పాత్రికేయుల క్రీడా పోటీల్లో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. నగరాభివృద్ధికి సమిష్టిగా పాటుపడదామని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల స్పూర్తితో త్వరలోనే కార్పొరేటర్లకు క్రీడా పోటీలు నిర్వహించే ఆలోచన చేస్తామన్నారు. ఇందుకు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌,దుర్గారావులు మాట్లాడుతూ స్పోర్ట్స్‌ మీట్‌ విజయవంతానికి తమ పాలకవర్గం పూర్తిస్ధాయిలో కృషి చేస్తుందన్నారు. బుధవారం నుంచి పోర్టు స్టేడియంలో క్రికెట్‌ టోర్ని అట్టహాసంగా ప్రారంభమవుతుందన్నారు. 13 జట్లు పోటాపోటీగా తలపడనున్నట్లు చెప్పారు.ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఫోటో, విడియో జర్నలిస్టులతో పాటు వెబ్‌ న్యూస్‌ జర్నలిస్టులు పాల్గొంటనున్నట్లు చెప్పారు. ఇండోర్‌ గేమ్స్‌లో భాగంగా చెస్‌,క్యారమ్స్‌, షటిట్‌ పోటీలను డిప్యూటీ మేయర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌,జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, విస్జా అధ్యక్షుడు ఉమా శంకర్‌ బాబు, విజెఎఫ్‌  కార్యవర్గ సభ్యులు  గిరిబాబు, ఈశ్వరరావు,ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌,వరలక్ష్మీ, విస్జా ప్రతినిధులు పాల్గొన్నారు.