విశాఖలో విజెఎఫ్-సిఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం..
Ens Balu
1
Visakhapatnam
2021-09-22 06:32:23
విశాఖ నగరాన్ని మెగా సీటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్నిచర్యలు చేపడుతుందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ పోర్టు స్టేడియంలో బుధవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్,విస్జా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నికి ఎంపీ ఎంవీవీ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు, ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా రూపాంతంరం చెందుతున్న విశాఖలో అనేక నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతాయన్నారు. మూడు దశబ్దాలకు పైగా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు జర్నలిస్టుల క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయమన్నారు. విజెఎఫ్ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండం సంతోషంగా ఉందన్నారు. గౌరవ అతిథిలుగా హాజరైన నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె రాజు మాట్లాడుతూ, నగరాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రసంశనీయమన్నారు. జర్నలిస్టుల సహకరారంతోనే తామంతా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలిగామన్నారు. జీవీఎంసీ స్మార్ట్ సీటీ కార్పోరేషన్ చైర్మన్ జివి వెంకటేశ్వరరావు(జీవీ) మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో కొనసాగే జర్నలిస్టులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మెరుగైన ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతంత లభిస్తుందన్నారు. జర్నలిస్టుల క్రీడలు పూర్తిస్ధాయిలో విజయవంతం కావాలని అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్‌లు నిర్వహించిన ఘనత విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. విజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు, సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వరరావు, ,పైలా దివాకర్ తదితరులు పాల్గొన్నారు.