జర్నలిస్టుల సమైఖ్యతకు క్రీడా పోటీలే నిదర్శనం..


Ens Balu
1
Visakhapatnam
2021-09-23 06:13:50

జర్నలిస్టుల సమైఖ్యతకు క్రీడా పోటీలు స్ఫూర్తిదాయకయమని విఎంఆర్‌డిఎ చైర్పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల అన్నారు. గురువారం ఇక్కడి పోర్టు స్డేడియంలో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌,విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ మీడియా క్రికెట్‌ పోటీలకు విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణీ, ఏపీ ఈపీడీసీఎల్‌ సిఎండి కె.సంతోషరావు ,డైరెక్టర్‌ బి.రమేష్‌ప్రసాద్‌లు  అతిథులుగా హాజరై క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్‌ జర్నలిస్టుల కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఆదర్శనీయమని కొనియాడారు. నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఈ తరహా క్రీడా పోటీలతో మానసిక ప్రశాతంత,మెరుగైన ఆరోగ్యానికి  దోహదం చేస్తుందన్నారు. జర్నలిస్టుల కోసం ప్రభుత్వ పరంగా తమ వంతు సహయ,సహకారాలు అందిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో విజెఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లు నిర్వహించిన ఘనత  విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు, సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, పైలా దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.