ప్రపంచ ఖ్యాతికి ప్రతిభ తొలి పెట్టుబడి..


Ens Balu
1
Visakhapatnam
2021-10-01 08:37:17

ప్రతిభపాటవాలతోనే ప్రపంచ ఖ్యాతిని సాధించే అవకాశం కలుగుతుందని రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ వెల్పర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జాన్‌వెస్లీ అన్నారు.శుక్రవారం ఇక్కడి పోర్టు మైదానంలో   వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం,సిఎంఆర్‌,విస్జా సంయుక్త ఆధ్వర్వంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ మీడియా క్రికెట్‌ పోటీలకు జాన్‌వెస్లీ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభాపాటవాలతోనే క్రీడాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడాకారులు క్రీడా స్పూర్తిని పెంపొందించే విధంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ఏయూ ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ ఆచార్య విజయమోహన్‌, కృష్ణ కాలేజీ అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ మధుసుధనరావు మాట్లాడుతూ జర్నలిస్టుల క్రీడలు అభినందనయమన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించిన వారికి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లు నిర్వహించిన ఘనత  విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.  విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు,నాగబొయిన నాగేశ్వరరావు,పైల భాస్కరరావు సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, ,పైలా దివాకర్‌, శేఖర్‌ మంత్రి,డేవిడ్‌రాజు,గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.