ఘనంగా జాతీయ కరాటే పోటీలు ప్రారంభం..


Ens Balu
1
Visakhapatnam
2021-10-09 08:38:38

విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో శనివారం గంటా కనకారావు మెమోరియల్‌ జాతీయ కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 19 రాష్ట్రాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, విశ్రాంత ఎస్పీ రాజశిఖామణి, అప్పన్న దేవస్ధానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు, స్వర్ణభారతి ఇండోర్‌స్డేడియంతో పాటు, ఇతర క్రీడాప్రాంగణాలను ఆధునీకరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కనకరావు పేరిట జాతీయ స్ధాయిలో మెమోరియల్‌ కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన రాజశిఖామణి, గంట్ల శ్రీనుబాబులు మాట్లాడుతూ కనకరావు ఆధ్వర్యంలో ఎన్నో జాతీయ పోటీలు విశాఖ వేదికగా నిర్వహించడం జరిగిందన్నారు. అటువంటి వ్యక్తి పేరుమీద మరోసారి జాతీయ కరాటే పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తొలుత  పోటీలను ప్రారంభించే ముందు సీనియర్‌ కరాటే మాష్టార్‌  కనకరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లుర్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ వర్కర్‌ ఉప్పలపాటి రాణా,సతీష్ కుమార్‌, నాయుడు, ప్రవీణ్ తో పాటు గంటా కనకరావు శిష్యబృందం మొత్తం పాల్గోంది. ఈ పోటీలను ఛాంపియన్స్‌ కరాటే డోజో నిర్వహిస్తుంది.