మానసిక ఉత్సాహానికి క్రీడలు దోహదం..


Ens Balu
1
Anantapur
2021-10-09 17:00:09

ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు దోహదపడుతాయని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. స్థానిక పిటీసీ మైదానంలో శనివారం కార్పొరేటర్లు, అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగుల మధ్య క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. క్రికెట్ మ్యాచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేయర్ మహమ్మద్ వసీం,రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి డిప్యూటీ మేయర్ లు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల జట్టుకు నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి,కార్పొరేటర్ల జట్టుకు డిప్యూటీ మేయర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించారు.మున్సిపల్ కార్పొరేటర్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకొని 15 ఓవర్లు గాను 112 పరుగులు సాధించారు. కార్పొరేటర్ అనిల్ కుమార్ రెడ్డి 48  పరుగులు తీసి నాటౌట్ గా నిలచారు.తరువాత బ్యాటింగ్ చేసిన మున్సిపల్ సిబ్బంది 15 ఓవర్ల గాను 81 పరుగులు తీసి నాలుగు వికెట్లు నష్టపోయారు. కమిషనర్ మూర్తి మూడు వికెట్లు తీసి సత్తా ఛాటినప్పటికి  31 పరుగుల తేడాతో మున్సిపల్ కార్పొరేటర్ లో విజయం సాధించారు.ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కార్పొరేటర్లు, ఉద్యోగుల మధ్య క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప కార్యక్రమన్నారు.కార్పొరేటర్లు, ఉద్యోగులు నిత్య ఎంతో ఒత్తిడితో ఉంటారని ఒత్తిడిని తగ్గించడానికి ఇలాంటి మ్యాచ్ లు ఎంతో ఉపయోగపడటంతో  పాటు కార్పొరేటర్లు, ఉద్యోగుల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం కూడా  ఏర్పడుతుందన్నారు.రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్లు రాజకీయ నాయకులే కాదు క్రీడాకారులు కూడా అని నిరూపిస్తున్నారని కొనియాడారు.ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి గెలుపు ఓటములను కూడా  ఫ్రెండ్లీ గానే తీసుకోవాలని సూచించారు.ఉద్యోగుల జట్టును కమిషనర్ పివివిఎస్ మూర్తి,కార్పొరేటర్ల జట్టుకు డిప్యూటీ మేయర్ కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.