బాక్సింగ్ లో రాష్ట్ర ఖ్యాతి ఇనుమడింపజేయాలని ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. హర్యానాలో ఈనెల 21 నుంచి 27 వరకూ జరిగే ఆల్ ఇండియా బాక్సింగ్ బాలికల సబ్ జూనియర్ చాంపియన్ షిప్ లో పాల్గొనే జట్టుకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు అథ్లెట్లను మంత్రికి పరిచయం చేశారు. . మంత్రిని కలిసినవారిలో ఆంధ్రప్రదేశ్ స్ఞేట్ బాక్సింగ్ సంఘం ఉపాద్యక్షులు దల్లి రామకృష్ణరెడ్డి, సెక్రటరీ లక్షమణదేవ్, ద్రోణాచార్య అవార్దు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, జిల్లా బాక్సింగ్ సంఘం కార్యదర్శి అప్పన్నరెడ్డి, ఆర్.ఒ.సి చైర్మెన్ దండు నాగేశ్వరరావు, మారుతి బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపకులు మారుతి ప్రసాద్ ఉన్నారు.