తిరుపతి-తిరుమల రోప్ వేపై అధ్యయనం


Ens Balu
53
Tirumala
2023-01-05 15:29:00

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శీ వేంకటేశ్వరస్వామివారిని చేరుకోవడానికి భక్తులకు ఇప్పటి వరకూ రోడ్డు మార్గమే వుంది. కాగా ఇపుడు రోప్ వే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై త్వరలో అధ్యయనం జరగనుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థను ఆదేశించినట్టు ఎంపీ గురుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ అధ్యయనం చేసి డీపీఆర్ ఇస్తే తొలుత నాలుగు కిలోమీటర్లు మేర రోప్ వే వేయాలని తరువాత.. మిగిలిన ప్రాంతాన్ని రెండవ భాగంలో నిర్మించాలని భావిస్తున్నారట. ఈ రోప్ వే నిర్మాణం కార్యరూపం దాలిస్తే శ్రీవారి దర్శించడానికి వెళ్లే సమయంలో ఏడు కొండలను స్వయంగా భక్తులు తిలకించడానికి, ప్రకృతి అందాలను ఆశ్వాదించడానికి ఆస్కారం వుంటుంది.