విశాఖలో విజ్ఞాన పర్యాటకం..విద్యార్ధులకు విద్యా విహారం..!


Ens Balu
211
visakhapatnam
2024-10-17 19:14:45

 విజ్ఞానంతో పాటు విహారం చేయాలని ఉందా.. పర్యాక ప్రదేశాలను తిలకించడంతోపాటు విద్యా సంబంధిత అంశాలను తెలుసుకోవాలని ఉందా..? విహారంతో పాటు సరికొత్త అంశాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వమే కల్పిస్తే..సరదాగా పిక్నిక్ లు చేసుకునే ప్రదేశాలను సంద ర్శించినపుడే విద్యాపరమైన అంశాలను తెలుసుకుంటే.. విద్యార్ధులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.. సరిగ్గా ఇలాగే ఆలోచిం చింది జిల్లా పర్యాటకశాఖ. విశాఖలో విహారానికి వచ్చే విద్యార్ధులకు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశ్యంతో చక్కటి కార్యక్రమా నికి శ్రీకాకం చు ట్టింది. విహార ప్రాంతాలను, పర్యాటక ప్రదేశాలను చూపిస్తూ.. విద్యార్ధులకు అవసరమయ్యే విద్యాసంబంధిత ప్రదేశాలను కూడా పర్యాటక ఎడ్యూకేషనల్ టూరిజం ను రూపొదించింది. ఆ వివరాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుంటే..

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖలో పర్యాటక ప్రదేశాలతోపాటు, విద్యార్ధులకు అవసరమయ్యే ప్రదేశాలను కూడా చూపించి వారి విద్యా, ఆలోచనలను పెంపొదింప చేయడానికి ఏర్పాటు చేసినదే ఈ ఎడ్యుకేషనల్ టూరిజం. పర్యాటక ప్రదేశాలతోపాటు మ్యూజియంలు, జూపార్క్, ఆంధ్రా యూనివర్శిటీలోని జీవశాస్త్ర ప్రయోగశాల వంటి ప్రదేశాలను కూడా విద్యార్ధులు తిలకించడానికి అవకాశం వుంటుంది. ఇక్కడ కొన్ని మ్యూజియంలలో ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులకు ఉచితంగానూ.. ప్రైవేటు విద్యాసంస్థలకు నామ మాత్రపు రుసుముతోనూ పలు మ్యూజియం లలో ఎంట్రీ వుంటుంది. తద్వారా విద్యాసంస్థలకు తమ విద్యార్ధులకు ఏదైనా టూర్ లు ప్లాన్ చేసినపుడు పర్యాటకశాఖను సంప్రదిస్తే.. ఈ ఎడ్యుకేషనల్ టూరిజం ద్వారా అన్ని ప్రాంతాలను తిప్పి చూపించే ప్యాకేజీలను వివరిస్తారు. తద్వారా విద్యార్ధులకు చాలా విషయాలు తెలియడంతోపాటు వివిధ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడానికి విద్యాసంస్థలు దోహదం చేసినట్టు అవుతుంది. ఇంటర్ చదివే విద్యార్ధులు తమ ఉన్నత చదువుల్లో సరికొత్తగా ఆలోచించడానికి, మంచి కోర్సులు చేపట్టడానికి ఒక అవగాహన లా కూడా ఈ ఎడ్యుకేషనల్ టూరిజం ఎంతగానో ఉపయోగపడే అవకాశాలున్నాయి. 

-మూడు రకాల ఎడ్యుకేషనల్ టూర్ ప్యాకేజీలు
1)మెరైన్ మ్యూజియం ఎడ్యుకేషనల్ టూర్ : ఇందులో సీ హరియర్,  టి యు-142 ,  సబ్ మెరిన్ & మ్యారిటన్ మ్యూజియం అనుసంధానం చేస్తూ ప్యాకేజీ వుంటుంది. ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు ఈ టూర్ చేస్తే.. వారిలో మెరైన్ సిస్టమ్, ఎయిర్ ఫోర్స్ వంటి అంశాలపై మంచి అవగాహన వస్తుంది. సాధారణంగా చాలా మందికి ఇవి ఎక్కడున్నాయో తెలియదు. అందునా తెలుసుకోవడానికి చాలా వ్యయ ప్రయాసలు పడాల్సి వుంటుంది. అదే ఈ ప్యాకేజీ ద్వారా పర్యాటకశాఖ నేరుగా విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధులకు ప్రత్యేక వాహనాల ద్వారా వీటిని తిప్పి చూపిస్తుంది.

2)  బయో డైవర్సిటీ ఎడ్యుకేషనల్ టూర్ ప్యాకేజీ: ఇది జీవవైవిధ్య విద్యా పర్యటన ఇందులో ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ ,బయోడైవర్సిటీ పార్క్ అనుసంధానం చేస్తూ పర్యటన సాగుతుంది. ఈ టూర్ బైపీసీ, సీబీజెడ్ చదివే విద్యార్ధులకు విద్యా పరంగా ఎంతో ఉపయోగంగా వుంటుంది. ఈ టూర్ లో ఈ రెండు ప్రదేశాలను చూసిన వారికి విద్యార్ధులకు ప్రాజెక్టు వర్కులు, ఇంటర్ తరువాత, డిగ్రీ తరువాత చేయాలనుకునే కోర్సులకు సంబంధించి కూడా మంచి అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా చాలా ప్రైవేటు కళాశాలలు తమ విద్యార్దులను బొటానికల్ టూర్స్ కి తీసుకెళుతుంటాయి. వారికి ఈ టూర్ ఎంతో అవగాహనక కల్పిస్తుంది.

3)కోస్టల్ ఇన్విరాన్ మెంటల్ టూర్: తీర పర్యావరణ వ్యవస్థ పర్యటన.. ఈ పర్యటనలో విద్యార్ధులు  ఆంధ్రా యూనివర్శిటీలోని  జీవశాస్త్ర ప్రయోగశాల,
ఎఫ్ఆర్ సిసిఈ, మడ అటవీ పరిశోధన కేంద్రం, ఎఫ్ఎస్ఐ మ్యూజియం,  తీరప్రాంత పరిశోధనలు, మెరైన్ లైవ్ వాక్ తో కలిగివుంటుంది. ఈ టూర్ లో విద్యార్ధులు పర్యావరణానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి వీలుపడుతుంది. అంతేకాకుండా జువాలజీకి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడానికి వీలుపడుతుంది.

-విద్యార్ధులకు ఎడ్యుకేషనల్ టూరిజం ఒక విద్యానిధి.. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే ఎడ్యుకేషనల్ టూరిజం ఒక విద్యానిధిగా ఉపయోపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పర్యటనలో విద్యార్ధులు అన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలతోపాటు, పరిశోధన కేంద్రాలు, మ్యూజియంలు చూస్తారు. ఇంటర్ చదివే విద్యార్ధులు ఈ తరహా ఎడ్యుకేషనల్ టూర్స్ చేయడం ద్వారా వారికి ఉన్నత విద్య అభ్యసించే సమయంలో మంచి కోర్సలు ఎంచుకొని వారి ఆశలకు అనుగుణంగా విద్యను అభ్యసించడానికి మంచి ఆలోచనలను కలుగేజేసే విధంగా వుంటుంది.

-పర్యాటకం తోపాటు విద్యా సంబంధిత అంశాలు చేరవు అవుతాయి.. జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి
విద్యార్ధులు విశాఖలోని పర్యాటక ప్రదేశాలను ఒక్కటే తిలకిస్తే.. వారికి కలిగేది ఆనందం మాత్రమే అదే. ఎడ్యుకేషనల్ టూర్ లో విద్యా, విజ్ఞానానికి సంబంధించిన ప్రదేశాలను తిలకించడం ద్వారా విద్యార్ధులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ తెలియని అంశాలు కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది. విద్యార్ధులను, విద్యాసంస్థలను దృష్టిలో ఉంచుకొని, వారికి ఎడ్యుకేషనల్ టూరిజం ద్వారా మ్యూజియంలు, పరిశోధనా కేంద్రాలను చూపించి వారికి మంచి ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తున్నది.

విద్యార్దులు, విద్యా సంస్థలు ఈ ఎడ్యుకేషనల్ టూర్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యార్దులకు మంచి విజ్ఞానం అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలతోపాటు, ఈ విధమైన ఎడ్యుకేషనల్ టూర్స్ చేయడం ద్వారా విద్యార్ధులకు తమ కాలేజీ సమయంలో చేసిన పర్యటనలు కలకాలం గుర్తుండిపోతాయి. పర్యాటకశాఖ ఏర్పాటు చేసి ఈ ప్యాకేజీల్లో మూడు రకాల టూరిజంలను కలిపి చూడగలిగితే ఇక విద్యార్ధులకు ఒక విద్యానిధిగా ఈ పర్యటనలు గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు పర్యాటకశాఖ అందిస్తున్న ఈ ప్యాకేజీలను అందిపుచ్చుకోగలిగితే విద్యార్ధులకు పర్యాటక ప్రదేశాలతోపాటు గుర్తిండిపోయే విజ్ఞానాన్ని కూడా అందించన వారవుతారు. సో విద్యార్ధులూ మీదే ఆలస్యం.. ఎడ్యూ టూర్ పై ఓ లుక్ వేయండి..!