1 ENS Live Breaking News

ఆలయాలపై దాడులు దుర‌దృష్ట‌క‌ర‌ం..

తిరుమ‌ల శ్రీ‌వారిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు శుక్ర‌వారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు.  ఆల‌యం వ‌ద్ద శ్రీ స్వామివారికి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జవ‌హ‌ర్ రెడ్డి క‌లిసి తీర్థ‌ప్ర‌సాదాలు చిన్నజీయర్ స్వామికి అంద‌జేశారు. ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం వెలుప‌ల  చిన్నజీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ క‌రోనా మ‌హమ్మారిని ప్ర‌పంచానికి దూరం చేసే శ‌క్తి క‌లియుగ దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి మాత్ర‌మే ఉంద‌న్నారు. ఈ వ్యాధిని త‌ట్టుకోగ‌లిగే శ‌క్తిని ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని, దీన్ని రూపుమాపే శ‌క్తి వైద్యులకు ఇవ్వాల‌ని స్వామివారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు. ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల‌కేంద్రాల‌ని, అనేక వైదిక క‌ళ‌లు, లౌకిక క‌ళ‌లు వీటి ఆధారంగా మ‌నుగ‌డ ‌సాగిస్తున్నాయ‌ని వివ‌రించారు. ఆల‌యాల ద్వారా వేల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా పోష‌ణ ల‌భిస్తోంద‌న్నారు. ఇంత‌టి విశిష్ట‌మైన ఆల‌యాల్లోని విగ్ర‌హాల‌పై ఇటీవ‌ల దుండ‌గులు దాడులు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. రామ‌తీర్థంలోని ఆల‌యానికి జ‌రిగిన న‌ష్టంపై ఇటీవ‌ల ప‌రిశీలించాన‌ని చెప్పారు. అక్క‌డ ఇత‌ర వ‌స‌తుల‌తో ఆల‌యాన్ని అభివృద్ధి చేయాల‌ని టిటిడి ఛైర్మ‌న్  వైవి.‌సుబ్బారెడ్డిని కోరామ‌న్నారు. ఆల‌యాలు బాగుంటే ప్ర‌జ‌ల్లో నైతిక ప్ర‌వృత్తి బాగుంటుంద‌ని, ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉంటార‌ని వివ‌రించారు.

Tirumala

2021-02-26 14:22:43

నలంద కిషోర్ కరోణా మ్రుతిని రాజకీయంచేస్తే ఊరుకోం..

టిడిపికి చెందిన నలంద కిషోర్ ప్రభుత్వ, పోలీసుల వేదింపుల కారణంగా మ్రుతిచెందారంటూ ఎల్లోమీడియా ద్వారా బురదచల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హితవు పలికారు. ఆదివారం విశాఖ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. నలంద కిషోర్ అనే వ్యక్తి  కరోనా లక్షణాలతో చనిపోతే దానిని రఘురామ క్రిష్ణరాజు ప్రభుత్వంపై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు ఆయనెవరో రఘురామక్రిష్ణరాజుకి తెలుసా అని ప్రశ్నించారు. ఆయన కరోణాలో మ్రుతిచెండం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామే తప్పా...చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టుతో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తూ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖలో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి కొందరు టిడిపికి చెందిన మాజీ మేయర్ దొరబాబు సారధ్యంలో ఇలాంటి నీచ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసలు అరెస్టు చేసి రెండు రోజుల్లోనే వదిలేశారని అన్నారు. తరువాత ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబుతో చేతులు కలిపి విశాఖ ప్రజల్లో అబధ్రతా భావం కలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Visakhapatnam

2020-07-26 12:32:38