1 ENS Live Breaking News

ఎల్లో మీడియాతో ఇక ప్రత్యక్ష యుద్దమే..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో యుద్దాలు జరబోతున్నాయి.. ఇప్పటి వరకూ మాటల తూటాలు మాత్రమే పేలిన రాష్ట్రంలో ఇక ప్రత్యక్ష యుద్దానికి ప్రభుత్వం నుంచి కార్యకర్తల వరకూ ప్రతీ ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ఏంటి యుద్దమంటే తన్నుకునే కొట్టునే చంపుకునే యుద్దం కాదు..ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మకుండా ఉండేందుకు జరిపే పోరుబాట. ఈ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అన్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పిలుపుతో పార్టీ అధికారిక సోషల్ మీడియా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎదురుదాడి చేయడానికి సిద్దమయ్యారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఎల్లో మీడియాలో అసత్యప్రచారం జరిగినా దానిని తిప్పికొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. దానికోసం రాష్ట్రస్థాయిలో ఒక బ్రుందం, జిల్లా స్థాయిలో మరో బ్రుందం, మండల, గ్రామస్థాయిలో నేతలు, కార్యకర్తలు ఇలా అందరూ ప్రత్యేక బెటాలియన్ లా మారి వ్యతిరేక ప్రచారానికి గాలి తీసేసే ప్రయత్నం మొదలు పెట్టారు. అధికారిక కార్యక్రమాలకు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక మీడియాకి కనీసం కబుర్లు కూడా చెప్పని ప్రభుత్వం, మంత్రులు, నాయకులూ గ్రామాలు, మండలాల్లో కూడా వారిని అంటరానివారిగా చూసే చర్యలకు దిగుతున్నారు. ఒక రకంగా ఎల్లో మీడియాలో ఆత్మ స్తైర్యాన్ని పూర్తిగా అనగదొక్కేందుకు ఎక్కడికక్కడ కార్యాచరణలు మొదలయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు నవరత్నాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. మంచిని చూడకుండా అందులో ఒకరిద్దరికి సాంకేతిక కారణాలు.. అర్హతలు లేకపోవడం వలన పథకాలు అమలు కాకపోతే వాటినే ఎల్లోమీడియా బూతద్దంలో పెట్టి మరీ చూపుతోంది. అంతేకాదు వివిధ ఛానళ్లలో ప్రత్యేక డిబేట్లు పెట్టి పదే పదే గోరంత విషయాన్ని కొండంతలు చేసి చూపి దానినే నిజం అని ప్రజలు నమ్మేలా చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక సిటీ కేబుల్ లైన్ ఏపీ ఫైబర్ నెట్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లతో పాటు మరికొన్ని తోక ఛానళ్ల  ప్రసారాలు నిలిచిపోయాయి. ఇటు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలను పార్టీలో నాయకులు ఎవరూ వినియోగించే పరిస్థితి గానీ కొని చదివే పరిస్థితి గానీ లేకుండా పోయాయి. ఇక ఏపీ ఫైబర్ నెట్ లో ఎల్లో మీడియా ఛానళ్లను చూడాలంటే దానికి ప్రత్యేకంగా రుసుము చెల్లిస్తే తప్పా ఆ ఛానళ్లు ప్రసారం అయ్యే పరిస్థితి లేదు. దానితో వారంతా ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానళ్లు, కంటెంట్ స్టోరీలను అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల ముందుకి తీసుకెళుతున్నారు. ఎప్పుడు ఎక్కడ.. ఏవిధంగా తప్పుడు, అసత్య ప్రచారం చేసినా దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నేరుగా దిశా నిర్ధేశం చేయడంతో నేతల నుంచి కార్యకర్తల వరకూ అందరూ అదే పనిలో నిమగ్నమైపోయారు.

ప్రభుత్వంపై పదే పదే బురద జల్లుతుంటే ఏ ఒక్కరూ చూసి ఓర్చుకునే పరిస్థితి ఉండకూడదు. నిజంగా తప్పు జరిగితే సరిద్దుకోండి. లేని పక్షంలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ వాటిని ఖండించకపోతే ప్రజలు అదే నిజమని నమ్మే ప్రమాదముందని..ఆ విషయంలో ప్రతీ ఒక్కరూ తప్పుడు ప్రచారాలను ఖండించాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహరెడ్డి పిలుపునివ్వడంలో ఎదురు దాడికి సిద్దమైంది వైఎస్సార్సీపీ కేడర్ అంతా. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతున్నన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా అమలు కావడం లేదు. అన్నీ డబ్బుతో కూడుకున్నవే..అందునా వందల కోట్ల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో జరిగే కొన్ని కొన్ని తప్పులను కావాలని చేస్తున్న అతిపెద్దతప్పులుగా..అక్రమార్కులుగా చిత్రీకరించడంలో ఎల్లోమీడియా చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వంపైనా..పార్టీలపైనా..అధికార యంత్రాంగంపైనా జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని.. అదే సమయంలో వాస్తవాలను కూడా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కూడా అన్ని జిల్లాలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా క్రుత నిశ్చయంతో ఉన్నాయి.

ఇక పార్టీలో ఉంటూ.. అంతర్గతంగా జరిగే కొన్ని వ్యవహరాలను ఎల్లోమీడియాకి ఉప్పందించే నేతలను, కార్యకర్తలను కూడా వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. వారి వలన ఎల్లో మీడియాకు పార్టీలో జరిగే చాలా కార్యక్రమాలు ముందుగానే తెలిసిపోవడం వలన గోరంతలు కొండంతలై ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం, అధికార పార్టీ ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. చాలా వరకూ నేతలు ఫోన్లతో కంటే నేరుగానే ఎక్కువగా సంభాషణలు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఇబ్బందులు రాకుండా అందరూ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూనే.. ప్రభుత్వంపై జరిగే అన్ని అసత్యప్రచారాలను తిప్పికొట్టే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక అంశాలను కూడా పార్టీ కేంద్ర కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నది. అన్ని వర్గాల ప్రజలను మెప్పించి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో అడ్డువచ్చేవారిని వారి తప్పులను ఎత్తిచూపి మరీ ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీ నుంచి గ్రామస్థాయి కమిటీల వరకూ ఎల్లో మీడియా అసత్య ప్రచారంలో ఇక తగ్గేదే అంటున్నారు..!

Tadepalli

2022-07-30 04:35:04

ప్లీనరీ సాక్షిగా అమ్మ రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ లో అధికారలో ఉన్న వైఎస్సార్సీపీ కుటుంబ పరంగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే తెలంగానాలో పార్టీ పెట్టి షర్మిల దూరమవగా, ప్రస్తుతం తల్లి  విజయమ్మ కూడా దూరమవడంతో వైఎస్ ఆర్ సీపీ శ్రేణుల్లో ఆయోమయవాతావరణం ఏర్పడింది. ఇప్పటివరకూ పార్టీకి పెద్దగా.. గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ విజయమ్మ ఏకంగా పార్టీకి రాజీనామా ప్రకటనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఖంగుతిన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ వారసులిద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం అది తారాస్థాయికి వచ్చింది. ప్రధానంగా ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారాస్త్రంగా చూపించి సానుభూతిని పొంది జగన్ అధికారం చేపట్టారు. ఇప్పుడు ఆమహానాయకుడు రాజశేఖరెడ్డి భార్య అయిన విజయమ్మ పార్టీ నుంచి తప్పించడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్టు పార్టీ సీనియర్ నేతలు లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ప్లీనరీ సాక్షిగా నాటకీయ పరిణామాలు  చోటు చేసుకున్నాయనే విషయం బాహటమైంది. అయితే ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ, తాను తన బిడ్డ వైఎస్ జగన్ కు ఏ విధంగా తోడున్నానో.. షర్మిలకు కూడా తోడుగా ఉండాలని ప్రకటించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఏదో కొత్త విషయం ప్రకటిస్తారని అందరూ భావిస్తే.. గౌరవాధ్యక్షురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం..అమ్మా మీ రాజీనామాను మేము ఒప్పుకోలేకపోతున్నాము అనే దీర్ఘ గానం కార్యకర్తల్లో వినిపిచింది. ప్రస్తుతం రాజకీయాలను ద్రుష్టిమళ్లించడానికి వైఎస్సార్సీపీకి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించారా లేదంటే..నిజంగా తన కూతురు షర్మిలకు తెలంగాణలో సహాయ పడటానికి విజయమ్మే రాజీనామా చేశారా అనేది తేలాల్సి వుంది.


Hyderabad

2022-07-08 15:08:45

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-02 02:27:31

Hyderabad

2022-04-30 05:55:23

వంశీక్రిష్ణ అనేనేను శాసన మండల సభ్యునిగా..

విశాఖ నగర వైఎస్సార్సీపీలో ఆయన మెరుపు..ఒక సేవ..ఒక సహాయం.. ఒక ఉద్యమం.. ఆయనే సిహెచ్.వంశీక్రిష్ణశ్రీనివాస్. వైఎస్సార్సీపీ లో పదేళ్లు అవిశ్రాంతగా కష్టపడిన ఆయనకు ఇన్నేళ్లకు శాసన మండలి పదవి వరించింది. మంచి పదవి ఇస్తానన్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అనుకున్నట్టుగానే వంశీని ఎమ్మెల్సీని చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ద్వారా ఎంపికన వారి జాబితా ప్రకటించడంతో ఒక్కసారిగా విశాఖ మహానగరంలో వంశీ అభిమానులు పండుగ చేసుకున్నారు. మా అన్న వంశీకి..జగనన్న సముచిత న్యాయం కల్పించారంటూ పండుగ చేసుకున్నారు. ఒక్క వంశీక్రిష్ణ శ్రీనివాస్ కే కాకుండా మహిళలల నుంచి వరుదు కళ్యాణిని కూడా ఎమ్మెల్సీకి ఎంపికీ చేయడంతో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అయ్యింది. పేర్లు ప్రకటించిన తరువాత. ఇక నామినేషన్ ఆపై వంశీక్రిష్ణ శ్రీనివాస్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలింది. విశాఖ వైఎస్సార్సీపీ శిఖరంలో ఒక వెలుగు వెలగడానికి కారణం వంశీ గురువు రాజ్యసభ్య సభ్యులు విజయసాయిరెడ్డి, ఇతర శాసన సభ్యులు, మంత్రులు సహకారమేనని వంశీ ఈఎన్ఎస్ కిప్రత్యేకంగా చెప్పారు. ప్రస్తుతం వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ప్రకటించడంతో బీసీ వర్గంలో ఆనందం వ్యక్తమవుతుంది..

Visakhapatnam

2021-11-12 12:43:54

2021-08-29 16:35:35

విశాఖ నగరాభివ్రుద్ధికి సహకరించండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శుక్రవారం, జివిఎంసి సమావేశ మందిరంలో తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడారు.  ఒక గృహిణిగా ఉండి నేడు మేయర్ లాంటి ఉన్నత పదవి స్థాయికి ఎదగడానికి తోడ్పాటు అందించిన వారందరికి ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు. సుమారు 6 ఏళ్ల తరువాత కొలువుదీరిన పాలక వర్గం ద్వారా నగరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది, సమస్యలు పరిష్కరించడంలో మీడియా సహకారం కావాలన్నారు. ప్రధాన సమస్యలను,సూచనలు మీడియా తెలియజేయడం ద్వారా ప్రభుత్వం తో మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు తనవంతు క్రుషి చేస్తానన్నారు. నగరంలో వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు సత్వరమే సేవలు అందించేందుకు కమిషనర్ తో కలిసి పనిచేస్తామన్నారు. ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నా నేరుగా తన ద్రుష్టికి తీసుకు రావొచ్చునన్నారు.  తనకి ఈ పదవి రావడనికి కారణమైన  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి జీవితాంతం ఋణపడి ఉంటానని, రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు వి. విజయసాయి రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, సత్యవతి మరియు శాసన మండలి సభ్యులు, ఇతర వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, నగర అభివృద్ధికి కమిషనర్,  ఇతర ఉన్నతాధికారుల సహాయ సహాకారాలతో కృషి చేస్తానని తెలిపారు. 

Visakhapatnam

2021-03-19 19:09:16

YSRCP ఇంతకంటే మంచి పదవే ఇస్తుంది..

వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి పార్టీ ఇంతకంటే మంచి పదవే ఇస్తుందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురువారం విశాఖ జివిఎంసీ మేయర్ ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీ చాలా మంచి వ్యక్తి అని, ఆయనను, ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని మంచి పదవి ఇస్తుందని అన్నారు. మేయర్ అభ్యర్ధుల ఎన్నిక అనేది ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నిర్ణయించినదన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని గుర్తుచేశారు. మహిళలకు పెద్ద పీట వేయాలనే లక్ష్యంతోనే యాదవ సామాజిక వర్గం నుంచే మహిళా అభ్యర్ధిని విశాఖ జివిఎంసీకి పార్టీ మేయర్ ని చేసిందన్నారు. తన విషయంలో ఏవో రాజకీయాలు చేశారని అనడంలో అర్దం లేదన్నారు. ముఖ్యమంత్రి వంశీ విషయంలో చాలా స్ఫష్టమైన నిర్ణయంతో ఉన్నారన్నారు. కాగా విశాఖ జీవిఎంసీ మేయర్ కంటే పెద్ద పదవి ఏముంటుందని మీడియా మంత్రిని ప్రశ్నిస్తే..మళ్లీ మంత్రి సమాధానమిస్తూ చాలా పదవులే ఉన్నాయని...వాటిలో ఏదో ఒకటి వంశీకి పార్టీ ఇస్తుందని స్పష్టం చేశారు. ఎవరూ నిరుత్సాహ పడాల్సిన పనిలేదన్నారు..

Visakhapatnam

2021-03-18 21:57:52

యాదవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది..

పదేళ్ల నాకష్టం, శ్రమ, పార్టీకోసం చేసిన సేవ, విలువైన సమయం వ్రుధాగా పోయింది..ఎమ్మెల్యేగా రానీవ్వలేదు..జీవిఎంసీ మేయర్ ని కానివ్వలేదు..పార్టీఅభివ్రుద్ధి కోసం పడిన కష్టం, నిశ్వార్ధంగా ప్రజలకు చేసిన సేవ అన్నీ వ్రుధా..కావాలనే రాజకీయం చేసి నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు.. వైజాగ్ వైఎస్సార్సీపీలో ఇంట్రనల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు..యాదవుడి శాపం ఖచ్చితంగా తుగులుతుంది. ఒకసారి అడ్డుకున్నారు..అది వారికి తగిలింది..మళ్లీ అడ్డుకుంటున్నారు మరోసారి మా ఉసురు తగులుతుంది..అంటూ విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ పదవి ఇస్తానంటేనే తాను కార్పోరేటర్ గా బరిలో నిలబడ్డానని అన్నారు. కానీ చివరకి రాజకీయం చేశారని విచారం వ్యక్తం చేశారు. జీవిఎంసీ వద్ద మీడియాతో మాట్లాడారు వంశీ. ఇంతటి పరాభవం జరిగిన తరువాత ఏ తాను విశాణ నగర అధ్యక్ష పదవిలో కొనసాగడం బావ్యం కాదని తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కాగా తన విషయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చాలా పాజిటివ్ గా ఉన్నారని, కానీ జిల్లాలో మాత్రం రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి రాజకీయాలు పార్టీ ఎదుగుదలకు మంచిది కాదని, ఈ రోజు నన్ను మోసం చేశారు..ఇలాగే రేపు మరొక నేతను మోసం చేస్తారని, ఇలాంటి కుళ్లు రాజకీయాలు, దుష్టరాజకీయాలు విశాఖలాంటి నగరంలో మంచిది కాదన్నారు. తాను రెండు మూడు రోజుల్లో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ఆయన ఏవిధంగా చెబితే అలా చేస్తానని అన్నారు. ఇలాంటి తేడా రాజకీయాలు చేసినంత మాత్రనా తాను క్రుంగిపోనని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల మధ్యనే ఉంటానని వంశీ మీడియాకి వివరించారు. ప్యాకేజీలు తీసుకొనే పదవని వదులుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...ప్యాకేజీలు కోరుకునేవాడ్నైతే ప్రజలకు సేవచేయడానికి పదేళ్లు ఎందుకు వ్రుధా చేసుకుంటానని బదులిచ్చారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనే ఒకే ఒక్క కారణంతోనే నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Visakhapatnam

2021-03-18 21:39:57

డా. వైఎస్సార్ సాక్షిగా జివిఎంసీ నూతన పాలకవర్గం..

విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించిన 58 మంది కార్పోరేట్లర్లంతా దివంగతనేత డా.వైఎస్సార్ కి ఒకేసారి నివాళులు అర్పించారు. గురువారం జివిఎంసీలోని మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ కేంద్ర కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిలతో కలిసి కార్పోరేటర్లంతా విఎంఆర్డీఏ పార్కులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఒక గ్రూఫ్ ఫోటోకి పోజిచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, దివంగత నేత ఆశీస్సులతో మీరంతా విశాఖ ప్రజలకు మంచి సేవలు చేయాలని ఆకాంక్షించారు. మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ లకు శుభాకాంక్షలు చెప్పారు. మీ పాలనపై విశాఖ ప్రజలు నమ్మకం ఆధారపడి వుంటుందన్నారు. నిరుపేద కష్టాలు తీరాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావివ్వకుండా పాలకవర్గం పరిపాలన సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవీవీ సత్యన్నారాయణ, డా.బి.సత్యవతి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉత్తర నియోజకవర్గ సమన్వకర్త కెకెరాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, మాజీ మంత్రి పి.బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-18 18:41:32

విశాఖ నగర అధ్యక్ష పదవికి వంశీ రాజీనామా..

విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్ష పదవికి సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. తనకు పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడం వలనే తాను కార్యకర్తల దగ్గర తలఎత్తుకొని తిరగలేని స్థితిలో ఈ రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించారు. గురువారం విశాఖ మేయర్ ఎన్నిక అనంతరం ఆయన  మాట్లాడారు. కేవలం పార్టీలోని అంతర్గత రాజకీయాల వలనే తనను మేయర్ కానీయకుండా అడ్డుకున్నారని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ కి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పదేళ్లుగా పార్టీకోసం కష్టపడి పనిచేసిన తనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, ఆ తరువాత సముచిత స్థానం కట్టబెడతామని కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీచేయించి గెలిచిన తరువాత తనను కాకుండా మరో వ్యక్తిని మేయర్ నుచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. మేయర్ పదవి ఇస్తానంటేనే తాను కార్పోరేటర్ గా పోటీచేశానని లేదంటే పోటీకి దిగేవాడిని కాదని అన్నారు. కానీ అనూహ్యంగా మహిళకు మేయర్ పదివిని కట్టబెట్టారని అన్నారు. ఇంత అవమానం జరిగిన తరువాత కార్యకర్తలకు నాయకులకు తాను ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందోనని ముందుగానే రాజీనామా చేశానని అన్నారు. ఈవిషయాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. కాగా వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు జీవిఎంసీ గేటు వద్ద బైటాయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పార్టీకి విధేయుడిగా పనిచేసినందుకు పార్టీ ఇచ్చిన బహుమానం ఇదా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

Visakhapatnam

2021-03-18 15:21:41

వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న కాశీవిశ్వనాధం..

ఆంధ్రప్రదేశ్ లో ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పాలనకు ముగ్ధులైన వారంతా వారి మాత్రు పార్టీలకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని విశాఖ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీకిచెందిన సీనియర్ నాయకులు బి.కాశీవిశ్వనాధం వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా విశాఖలో ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విసారె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా జనరంజక పాలన అందిస్తున్నందునే వివిధ పార్టీల నుంచి నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారన్నారు. చేరిన వారంతా పార్టీ అభివ్రుద్ధికి, పార్టీ నిర్ధేశించిన అభ్యర్ధులకు మద్దతు ఇస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, మంత్రులు కె.కన్నబాబు, ఎంపీ ఎంవివిసత్యన్నారాయణ, ఉత్తర నాయకులు కెకెరాజు, కంపాహనోక్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-03-04 10:54:25

ఎన్నికల నియమావళి పాటించాల్సిందే..

 మున్సిపల్ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధులు ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని డిఎస్సీ శ్రీనివాసులు సూచించారు. సోమవారం క్రిష్ణాజిల్లా నూజివీడు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ను ఎలా పాటించాలో వివరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీచేసే అందరి అభ్యర్ధులపైనా పోలీసు నిఘా వుంటుందన్నారు. ఎవరూ ఎలాంటి గొడవలకు, అల్లర్లకు పాల్పడినా అలాంటి వారిపై ఎన్నికల నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే ఎన్నికల సంఘం విధించిన నియమనిబంధనలను ఖచ్చితంగా అభ్యర్ధులంతా పాటించాలన్నారు. అభ్యర్ధులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటనారాయణ, ఎస్.ఐ గణేష్ కుమార్, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు పాల్గొన్నారు.

Nuzividu

2021-03-01 13:38:40

విశాఖలో ఒకే ఒక్కడు..!

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుడంటే ఒక హోదా..ఒక ఠీవీ..ఒక దర్పం..వెనుక మందీ మార్భలం..అబ్బో చెప్పలేని హడావిడీ.. ఏ కార్యక్రమమైనా ఎంతో అట్టహాసంగా చేసి..నాలుగు కార్పోరేట్ కంపెనీలు ప్రారంభోత్సవం చేసి..మీడియాలో పబ్లిసిటీ..ఇది రాజ్యసభ సభ్యుని పదవి అనే నాణేనికి ఒక వైపు. రెండో వైపు ఏ పార్టీ నుంచైతే రాజ్యసభ్యకు వెళ్లారో ఆ పార్టీ హైకమాండ్ భజన.. సబ్బుకంటే నురగ కంటే అత్యంత దారుణంగా నురగ తీసే వ్యవహారం.. మరోసారి రాజ్యసభ సీటు కోసం పోరాటం, సీటు దక్కించుకోవడానికి ఆరాటం అన్నీనూ..ఏంటి విషయం చెప్పకుండా ఈయనేదో సినిమా చూపించడానికి ఈ ఉపోద్గాతమంతా చెబుతున్నాడు అనుకుంటున్నారా..అలా అనుకుంటే రాజకీయనాకుడు ఇచ్చిన హామీల మాటల్లో కాలుపెట్టినట్టేనని భావించుకోండి..మీరు చదువుతున్నది నిజమే..నేను చెప్పబోయేదీ నిజమే..అవునండి రాజ్యసభ సభ్యులంటే ఇప్పటి వరకూ అలానే నడిచింది రాజకీయమంతా..కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రం రాజ్యసభ ఎంపీ అంటే ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ఆధారణ, ఒక పోరాటం ఇవన్నీ మీకు విశాఖ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డిలో కనిపిస్తాయి చూడవచ్చు కూడా. ఇదేదో డబ్బాకొట్టడానికి రాస్తున్న కధనం కాదు. చాలాకాలం తరువాత రాజ్య సభ సభ్యుడంటే ఒక ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేయడానికి ఇంతలా కష్టపడతారా అన్నట్టుగా పనిచేసే విధానం రాబోయే రోజుల్లో చాలామందికి ఆదర్శం కాబోతుంది. విశాఖ చరిత్రలో ఏ రాజ్యసభ సభ్యుడూ ఉత్తరాంధ్రా కోసం, విశాఖ నగర అభివ్రుద్ధికోసం కష్టపడనంతగా ఈయనొక్కడే...ఒకే ఒక్కడుగా కష్టపడుతున్న తీరు ఇపుడు ప్రతీ ఒక్కరినీ ఆకర్షిస్తుంది.. ఆలోచింపచేస్తుంది. 50ఏళ్లు దాటినా కూడా అలుపెరగని ఉత్సాహంతో ఆయన చేసే పాదయాత్రలు, ఉద్యమాలు, ఉపన్యాసాలు, పరిపాలనా, రాజకీయం చూస్తుంటే విశాఖ అభివ్రుద్ధిని దేశంలోనే సిఖరాగ్రంగా నిలపాలనే భావన కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యుడంటే ఒక పార్టీ ఎమ్మెల్యేనో, మంత్రో, లేదంటే ఎమ్మెల్సీనో, అదీకాదంటే పార్టీలోని పెద్దలే వెళ్లి మాట్లాడితే తప్పా మాట్లాడని ఈరోజుల్లో...ఒక సామాన్యమైన వ్యక్తి వెళ్లినా నేరుగా ఆయనతో మాట్లాడి సమస్యలు తెలుసుకునే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయసాయిరెడ్డి. అంతేకాదు ఎవరు ఏమనుకున్నా తన పదవికి, హోదాకి, పార్టీకి గౌరవం తెవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని అలుపెరగకుండా చేస్తున్న విశాఖ అభివ్రుద్ధిలో కీలకమయ్యారు విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలో చాలా మంది ఆయన ఎవరికీ సహాయపడరు, ఎవరి మాటా వినరు, ఆయన కోటరీ వేరే, ఆయనకి దగ్గర కావాలంటే అవతలి వ్యక్తిలో చాలా విషయముండాలి అనే మాటలకు విజయసాయిరెడ్డి పెద్ద స్పందించరు...పైగా వాటన్నింటికీ ఒకటే సమాధానం నిండైన చిరునవ్వు. నువ్వు పార్టీకోసం ప్రభుత్వం కోసం చేయాల్సిందంతా చేస్తే పార్టీయే నిన్ను వెతుక్కుంటూ వస్తుందనే మాట చెబుతూనే.. దానినే పాటిస్తూ ప్రస్తుత రాజకీయనాయకులందరికీ మార్గదర్శిగా, పార్టీలోని చాలామంది నేతలకు గాడ్ ఫాదర్ గా మారారు విజయసాయిరెడ్డి. సైరా నరసింహారెడ్డి సినిమా ఎంత పాపులర్ అయ్యిందో తెలీదు కానీ..ప్రతిపక్షంపైనా, ప్రజా వ్యతిరేక విధానాలపైనా విజయసాయిరెడ్డి(సైరా) పేరుతో సోషల్ మీడియాలో పడే పంచ్ లకు అంతులేని పాపులారిటీ పెరిగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే సైరా పంచ్ లకు పడని వారుండరంటే అతిశయోక్తికాదేమో. అదే స్థాయిలో ప్రతిపక్షనేతలు చేసే తప్పులను, ప్రజా వ్యతిరేవిధానాలను ఎండగట్టే తీరుకూడా అగ్రబాగాన్నే వుంటుంది. ఇంత చేసినా పొగడ్తలకు పొంగిపోకుండా, తిట్ల పురాణాకి కుంగిపోకుండా..వైఎస్సార్సీపీలో జాతీయ కార్యదర్శిగా పార్టీ అభివ్రుద్ధికి నేతలను ప్రజా నాయకులుగా మార్చడానికి ఆయన చేస్తున్న సేవ...అన్నీ వెరసీ ఒకేఒక్కడిగా నిలబెతున్నాయంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఒక పార్టీ జనాల్లో ఇంతబాగా వెళ్లిదంటే దానికి విజయసాయిరెడ్డి లాంటి వారి తెలివి, పాలనా దక్షత, ప్రజల కోసం ఏదో చేయాలనే తపన అనే మాట ఇపుడు ప్రతీఒక్కరి నోట నుంచి వస్తుందంటే ఏ రాజకీయనేతకు రాని గుర్తింపు, మంచి పేరు ఈయనకు రావడమే. ఈ వార్త అంతా చదివిన తరువాత విశాఖ రాజ్యసభ్య సభ్యులు విజయసాయిరెడ్డిలోని అన్ని కోణాలను బాగానే టచ్ చేశాడంటూనే..ఒక ప్రత్యేక కోణంలోనూ చూపించే ప్రయత్నం చేశాడని అనుకోవచ్చు. అంతేకాదు మనసులో పార్టీ పట్ల అభిమానమైనా సైరా కోసం ఇంతలా రాసేలా చేసిందనే అనుకోవచ్చు...ఎవరు ఏమనుకున్నా..ఎవరి నోట నుంచి ఏ మాట విధంగా వచ్చానా.. మాటని తూటాలా పేల్చడానికి విమర్శలు చేయాలని చూసినా ఇందులో పెద్దగా ఫీలవ్వాల్సిన పనేమీ ఉండకపోచ్చు..చాలా సంవత్సరాల తరువాత ఒక మంచి లక్ష్యం ఉన్న నాయకుడిని, మంచి పరిపాలనా దక్షత ఉన్న నేతను, ప్రజల మనిషిని, పార్టీ విధేయుడిని, అందరివాడిగా పేరుపొందిన వ్యక్తిని చూసిన తరువాత అలవోకగా వచ్చిన పదాల అల్లికే ఈ ఒకేఒక్కడు కధనమని మనసున్న వారంతా గుర్తించాలి..తప్పదు..!

Visakhapatnam

2021-02-27 08:37:58