అన్నవరం దేవస్థానంలో విజిలెన్సు తనిఖీలు..


Ens Balu
8
Annavaram
2021-12-20 12:11:10

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో విజిలెన్సు తనిఖీలు నిర్వహించారు. ఏకంగా పాలకవర్గం సభ్యుడే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా దేవస్థానం భూముల ఆక్రమణ, నకిలీ ఉద్యోగులు, థర్డ్ పార్టీ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ల వ్యవహారం, అంతేకాకుండా ట్రస్టుబోర్డు చైర్మన్ పై కూడా ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు దేవస్థానంలో లోతుగా విచారణ చేపట్టారు. అయితే ఏఏ అంశాలపై విజిలెన్సు అధికారులు విచారణ చేపట్టారనే విషయాన్ని ఇటు దేవస్థాన అధికారులుగానీ, తనిఖీ సిబ్బంది సైతం బయట పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా దేవస్థానంలో రెండు విభాగాల్లో ఇద్దరు ఉద్యోగులు యాక్టింగ్ ఈఓలుగా వ్యవహరించడం, పెంచిన ధరలు, జరుగుతున్న అభివ్రుద్ధి పనుల్లో అవినీతి, లేని ఖర్చులు అధికంగా చూపడం తదితర అంశాలపై విచారణ జరిగినట్టు చెబుతున్నారు. అయితే దేవస్థానం అధికారులకి ఏసీబీ అధికారులంటే లెక్కలేని తనం ఉండటంతో విజిలెన్సు అధికారులు తనిఖీలను వీరు సాధారణ పరిపాలనాపరమైన తనిఖీలుగా భావించడం ప్రాధాన్యత సంతరించుకుంది..