తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి సన అందరికీ తెలిసిన వ్యక్తి.. ఇపుడు మరోసారి సన మెట్రో కథలు వెబ్ సిరీస్ ద్వారా వార్తల్లో నిలిచింది. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. హీరోలకు అమ్మ..అక్క పాత్రల్లోనూ కనిపించారు. వెండి తెరపై ఎన్నెన్నో డీసెంట్ పాత్రలు పోషించారు. వెబ్ సిరీస్ లో సహ నటుడు అలీ రెజ్జా తో వాస్తవికంగానే రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో సన ఇలాంటి పాత్ర పోషించేదేంటని పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఆ విషయంపైనే సన ప్రత్యేకంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. `నేను ఆ పాత్ర చేయడానికి కారణం దర్శకుడు కరుణ కుమార్ - రైటర్ ఖాదీర్ బాబు. మధ్య తరగతి మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుం టుంది? అన్నది నా పాత్రలో చూపించారు. దానితో తాగుబోతు భర్త.. భార్యని పట్టించుకోకపోతే.. ఆమె ఎలా ఫీలవుతుంది? సమాజం ఎలాఆలో చిస్తుంది? అన్నది ఓవైపు చూపించే సమయంలో బాధ్యతలు ఎలా ఉంటాయో నాచుట్టూనే తిరుగుతాయని వివరణ ఇచ్చింది.