విశాఖలో మల్లికా మాధుర్య స్వరాలు సినీసంగీత విభావరి


Ens Balu
51
Visakhapatnam
2023-03-25 09:33:37

మల్లికా మాధుర్య స్వరాలు కల్చరల్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5-45కు విశాఖ పౌర గ్రంథాలయంలో సినీ సంగీత విభావరి నిర్వహి స్తున్నట్టు ప్రముఖ సింగర్, సేవామూర్తి, సంస్థ నిర్వాహకులు నన్నపనేటి మల్లికా చౌదరి తెలియజేశారు. విశాఖలో ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులకు అభినందన సత్కారం చేయనున్నామని, అదేవిధంగా నగరంలోని పలువురు సంగీత కళాకారులతో సినీ సంగీత ఆలపన కూ డా వుంటుందన్నారు. కళాకారులును, సేవకులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు ఆమె వివిరంచారు. వి శాఖ కళలకు, సినిమా రంగానికి కూడా డెస్టినీ కావాలని, ప్రముఖ సినీ సంస్థలు వారి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.విశా ఖ మహానగరమే కాకుండా కళలకు, కళాకారులకు ప్రధాన వేదిక అని మల్లిక స్పష్టం చేశారు.