బోళా శంకర్ సినిమా టిక్కెట్లు పెంపుపై ప్రభుత్వం కొర్రీ


Ens Balu
47
Tadepalli
2023-08-09 15:43:14

మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళాశంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈనెల 11న రిలీజ్ కానున్న భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకు నేందు కు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. చిత్ర యూనిట్ ప్రభుత్వానికి చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోప్రక్క టిక్కెట్లు ధరలు పెంచే అవకాశం లేకపోయినా..చిరు సినిమాను చూసేందుకు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ సినిమాకి టిక్కెట్లు రేట్లు పెంచితే, ఎంత పెంచకపోతే ఎంత అంటూ అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియాని షేక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిరు సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.