విశాఖ జర్నలిస్టుకి హాస్యంలో ఉత్తమ రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు


Ens Balu
174
Visakhapatnam
2023-12-30 05:16:14

విశాఖలో జర్నలిస్టులిస్టు, ప్రముఖ కళాకారుడు, హాస్యనటుడైన డేవిడ్ రాజ్ కు ఉత్తమ హాస్యనటునిగా "నంది" పురస్కారం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా అందజేసే ఈ అవార్డు ఈయనకు రావడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  గుంటూరులో నిర్వహించిన నంది నాటకోత్సవం -2023లో  రాష్ట్ర చలనచిత్ర టీవీ,నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రముఖ సినీ నటులు పోసాని కృష్ణ మురళి ఈ అవార్డు ను అందజేశారు. అలాగే "శ్రీకాంత కృష్ణమాచార్య"  పద్య నాటకానికి ద్వితీ య ఉత్తమ ప్రదర్శనగా వెండి నంది, అలాగే ఇదే నాటికకు సంగీత బాధ్యతలు చేపట్టిన మురళికి ఉత్తమ సంగీత దర్శకుడు నంది అవార్డు వచ్చింది. నగరానికి చెందిన జయ కళానికేతన్ ఆధ్వర్యంలో  కె.వెంకటేశ్వర రావు దర్శకత్వంలో ఈ ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవ త్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమ తులు అందజేస్తారు. మొత్తం 5 విభాగాల్లో  73 నంది అవార్డులు కళాకారులకు అందజేశారు. నంది నాటకోత్సవాలు  డిసెంబరు 23 (శనివారం) నుండి  29 (శుక్రవారం) వరకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగాయి. 73 అవార్డుల కోసం 38 నాటక సమాజాలు 1200 మంది నటీనటులు పోటీపడ్డారు. నాటక ప్రదర్శనలు పరిశీలించి వాటికి స్వర్ణ, రజత, కాంస్య నందుల విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఈ బహుమతులు ప్రధానోత్సవం రాష్ట్ర సెలవలు శాఖ మాత్యులు అంబటి రాంబాబు , ఎఫ్ డి సి మేనేజర్ శేషా సాయి, ఎం.డి టీవీ కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డేవిడ్ రాజు నంది అవార్డు రావడం పట్ల ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చీఫ్ రిపోర్టర్, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) డేవిడ్ రాజుకి ఫోన్ చేసి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఈ నంది అవార్డుతో స్పూర్తితో సినీ, నాట రంగంలో మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.