అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం తనకెంతో ఆనందం కలిగించిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా తండ్రి అల్లు అరవింద్ కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, మొట్టమొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరోకి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమన్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక అవార్డు లు రావడం.. ఇటీవల అందుకున్నత్రిపుల్ సినిమా కు అలాగే నేడు అల్లు అర్జున్ కి అవార్డులు రావడం వలన తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయస్థాయింలో గుర్తింపు లభిం చినట్టు అయ్యిందన్నారు. అందులోనూ పాన్ ఇండియా హీరోగా ఉన్నబన్నీ ఈ అవార్డు అందుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, స్థాయి ప్రపంచకీర్తిని ఆర్జించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.