స్టాలిన్ సినిమా అవకాశాలనిచెప్పి వాడుకొని వదిలేశాడు


Ens Balu
151
Chennai
2023-09-05 15:58:36

తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్‌పై టాలీవుడ్ నటి, కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితమే ఉదయనిధితో నాకు పరిచయం ఏర్పడింది. నాతో గడిపిన ప్రతి మూమెంట్‌ తనకు నచ్చుతాయని ఎంతో చక్కగా చెప్పేవాడు. సినిమాల్లో నాకు ఛాన్స్ ఇప్పిస్తానని ఎన్నో మాయమాటలు చెప్పాడు. నన్ను లొంగదీసుకున్నాడు.. నచ్చినట్టుగా వాడుకున్నాడు.. నాతో అవసరం తీరాక నన్ను వదిలేశాడు.’ అని ఆరోపించింది. ప్రస్తతుం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతున్న తరుణంలో శ్రీరెడ్డి ఇంటర్యూ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతోంది. నేరుగా సీఎం కొడుకుపైనే ఈ విధంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అటు తమిళనాట కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గుగూల్ లోనూ, శ్రీరెడ్డి, స్టాలిన్ చిత్రాలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి.