సినీ తారలు అందం వెనుక రహస్యమిదే


Ens Balu
16
Hyderabad
2022-07-29 07:46:26

సినిమాల్లో నటించే హీరోలు.. హీరోయిన్ లు ఎంద అందంగా ఉంటారో కదా..ఏకంగా హీరోయిన్ లు అయితే గిల్లితేనే పాలు కారిపోతాయా అన్నట్టుగా అందంలో పోటీ పడతారు. అది బాలీవుడ్ కావొచ్చు..టాలీవుడ్ కావొచ్చు..కోలీవుడ్ కావొచ్చు. ఎక్కడైనా అందమే ప్రాణామానికం. అంతటి అందం వీరికి ఎలా వస్తుంది. దానికోసం ఏమైనా సర్జరీలు చేయించుకుంటారా..అంటే చాలా మంది అవుననే చెబుతారు. అందం కోసం రక రకాల ఉత్పత్తులు వినియోగిస్తారనేది ఇప్పటి వరకూ జరిగిన జరుగుతున్న ప్రచారం. కానీ సినీ తారల అందం వెనుక వున్న అసలు రహస్యం తెలిస్తే అంతా నోరెళ్ల బెట్టాల్సిందే. అవునండీ ఇది నమ్మినా నమ్మకపోయినా పచ్చినిజం. అసలు సినీ తారల అందాన్ని ఎలా కాపాడుకుంటారు..దానికోసం వారు ఏం చేస్తారో తెలిసినా అందరూ నోరెళ్ల బెట్టాల్సిందే. కానీ వాస్తవం చెబితే ఎవరూ నమ్మరు. కానీ విషయాలు నేడు ఇపుడు ఈఎన్ఎఎస్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

సినిమా తారలులా అందంగా ఉండాలంటే ఏం చేయాలి..వారు నటించి ప్రచారం చేసే ఉత్పత్తులు వాడితే సరిపోతుందా..అలా చేస్తే డబ్బులు లాసు తప్పితే మరేమి మిగలదనేది జగమెరిగిన సత్యం. మరేం చేస్తే వారిలా అందంగా..తెల్లగా..ఆరోగ్యంగా..వయస్సు తెలియకుండా ఉండొచ్చు అంటే దానికి చాలా రహస్యాలే మీకు తెలియజేయాలి. సినీ తారలులా మీరూ అందంగా కనిపించాలంటే కాస్త ఖర్చు అయినా వారికంటే నేచురల్ బ్యూటీ సొంతం అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. తారల అందం బ్యూటీపార్లర్ కి వెళితే వచ్చింది కాదనేది ముందు అంతా తెలుసుకోవాలి. దానికోసం శరీరంలోనే మార్పులను ఆహార నియమాలతో మార్చుకోవాలని గుర్తించాలి. అవునండి మనం కూడా తినేది ఆహారమే కదా మరెందుకు వారిలా అందంగా లేమూ అనుకుంటే కాదు. దానికి కూడా చాలా పద్దతులున్నాయి. ఆ పద్దతులను అనుసరిస్తూ..పాటిస్తే సినీ తారలు మించిన అందాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు.

సినిమా తారలు నలుగు ఎలా పెట్టించుకుంటాంటే..
ఏంటి సినిమా తారలు కూడా నలుగు పెట్టించుకుంటారా..? మీరు చెప్పేది నమ్మవచ్చా..అంటే నమ్మాలి.. అలా చేయండం వలనే వారి అందాన్ని తగ్గకుండా వారు కాపాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ నలుగు పెట్టించుకునే విధానంలో మాత్రం వాడేవన్ని సేంద్రియ ఉత్పత్తులే ఉంటాయి. అవునండి సినీ తారలు తినే ఆహారం దగ్గర నుంచి తాగే పళ్ల రసాలన్నీ కూడా సేంద్రియ పద్దతిలో పండించినవే తీసుకుంటారు. వారి అందంలో సేంద్రియ ఉత్పత్తులు ఎంతో కీలక భూమిక పోషిస్తాయి. సేంద్రియ పద్దతిలో పండిన శనగల్లో పోషక విలువలు పోకుండా వాటిని పిండి చేసి దానికి కూడా సేంద్రియ నువ్వుల నూనే రాసుకొని మాత్రమే నలుగు పెట్టించుకుంటారు. తద్వారా శరీరం నిగారింపు సంతరించుకుంటుంది. అలా చేసే సమయంలో వారు కుంకుమ పువ్వుని కూడా వినియోగిస్తారు. పాలలో కుంకుమ పూవుని నానబెట్టి వాటిని శనగపిండిలో కలిపి నలుగు పెట్టించుకుంటారు. దానికి ముందు అదే నువ్వుల నూనెతో శరీరం మొత్తం మసాజ్ చేయించుకుంటారు. ఇలా చేయడం ద్వారా మ్రుత కణాలు జీవం పోసుకుంటాయి. తద్వారా శరీరం నిగారింపు సంతరించుకుంటుంది.

బ్యూటీప్యాక్ లు కాదు..పళ్ల గుజ్జుతోనే ప్యాక్ లు..
సినీ తారలు పెద్ద పెద్ద బ్యూటీపార్లలో ట్రీట్ మెంట్ చేయించుకుంటారని అందరికీ తెలుసు..అది సినిమా షూటింగ్ ల సమయంలోనే మిగితా సమయంలోనే నేచురల్ బ్యూటీషన్లు అంతా సినీ తారలకు పండ్లు, పండ్ల గుజ్జుతోనే శరీరం మొత్తం ప్యాక్ లు వేస్తారు. సాధారణంగా పండ్ల రసాలతోనే సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు. కానీ సినిమా షూటింగ్ ల సమయంలో తప్పితే సినీ తారలు వాటిని ఎక్కువగా వినియోగించరు. మిగిలిన సమయం సేంద్రియ పద్దతిలో పండించే పండ్లతోనే సౌందర్యాన్ని కాపాడకుంటుంటారు. దానికోసం ప్రత్యేకంగా బ్యూటీషన్లు సినీ తారల ఇంటివద్దనే పనిచేస్తారు. ఏ ఒక్క ఉత్పత్తీ రసాయనాలు కలిపినవి వినియోగించరంటే అతియోక్తి కాదు..

సౌందర్యంలో కీలకంగా క్యారెట్, బీట్ రూట్
సినీతారల అందంలో క్యారెట్, బీట్ రూట్ రసాలు చాలా కీలక భూమిక పోషిస్తాయి. ఒక్కోసారి పచ్చికూరగాయ రసాలు కూడా వారి శరీంపై ముసలి ఛాయను రాకుండా కాపాడతాయి. ప్రతినిత్యం సినీతారలు ఉదయం సాయంత్రం సేంద్రియ క్యారెట్, బీట్ రూట్ రసాలు తేనెతో కలిపినవే తాగు తారు. శరీరంలో మలినాలు పోయేందుకు తులసీ టీ, గ్రీన్ టీని ఎక్కువగా సేవిస్తారు. మంచినీటిని కూడా ప్రత్యేకవిధానంలో ఆర్వో చేసిన వాటినే ఎక్కువగా తాగుతారు. అందరూ అనుకున్నట్టుగా సినీ తారలు మాంసాహారాన్ని అధికంగా తీసుకోరు. తీసుకున్నా వాటి కోసం ప్రత్యేకంగా జిమ్ లలో ప్రత్యేక వర్కవుట్లు చేస్తారు. ముఖ్యంగా ఆవిరి స్నానం తారల అందానికి మెరుగులు దిద్దుతుంది. ప్రతినిత్యం వర్కవుట్లు అనంతరం స్టీమ్ బాత్ చేయడం ద్వారా కూడా అందం తగ్గకుండా ఉంటారు. దానికోసం తారల ఇళ్లల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తారు. తినే బియ్యం నుంచి కూరగాయలు, నూనె, పండ్లు, పప్పులు ఇలా అన్నీ సేంద్రియ ఉత్పత్తులనే వినియోగిస్తారు. వీటికోసం తారలు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. అలా చేయడం ద్వారానే వారి అందాన్ని తగ్గకుండా కాపాడుకుంటారు. కానీ చాలా మంది సర్జరీలు చేయించుకోవడం ద్వారా వీరి అందం పెరుగుతుందని బావిస్తారు. అదేమీ కాకుండా వీరంతా సేంద్రియ ఉత్పత్తులు వినియోగించే వీరి అందం తగ్గకుండా చూసుకుంటారు.

అందం ఉన్నంత వరకే వారికి ఛాన్సులు..
సినిమాల్లో నటించే హీరోలైనా..హీరోయిన్ అయినా అందం వున్నంత వరకే వారికి ఛాన్సలు తన్నుకుంటూ వస్తాయి.. అలా రావాలంటే వారు అందాన్ని పది కాలాల పాటు కాపాడుకుంటూ ఉండాలి దానికోసం అత్యధిక మొత్తంలో ఖర్చు చేయడంతోపాటు, వర్కవుట్లు కూడా చేస్తుంటారు. ప్రత్యేకంగా డైటీషియన్లు, బ్యూటీషియన్లు, హెయిర్ డ్రెస్సర్స్ లను మెయింటేన్ చేస్తుంటారు. ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తుల వినియోగం పెరగడంతో సాధ్యమైనంత వరకూ వాటినే వినియోగిస్తూ వారి అందాన్ని పదిలంగా చూసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ మేకప్ లకు దూరంగా ఉండేందుకే సినీతారలు సమయం కేటాయిస్తారు. బయటకు వెళ్లినపుడు, సినిమా షూటింగ్ లు జరిగినపుడు తప్పా..ఇంట్లో ఉండే సమయంలో అందంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. అందుకే చాలా మంది హీరో, హీరోయిన్ లకు వయసు నాలుగు పదులు దాటినా వారి అందం చెక్కు చెదర కుండా వుంటుంది. ఇపుడు మీకు అర్ధమైందా వారి అందం వెనుక దాగి వున్న రహస్యం ఏమిటో..!