ఈటీవిలో జబర్ధస్త్ కి మంట పెట్టారా..?


Ens Balu
14
Hyderabad
2022-08-29 05:13:42

జబర్ధస్త్..జబర్ధస్త్.. జబర్ధస్త్..ఒకప్పుడు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్ వున్న ఈటీవీ ప్రోగ్రామ్.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు..బుల్లి తెరపై కూడా ధీటుగా కామెడీ అద్భుతంగా వుంటుందని తెలుగు ప్రజలకు తెలియజేసిన ఏకైన నవ్వుల కార్యక్రమం. అంతేకాదండోయ్ ఎన్నిపనులున్నా వారంలో గురువారం, శుక్రవారం కుటుంబం మొత్తాన్ని ఈటీవికి అతుక్కుపోయేలా చేసిన ఏకైక ప్రోగ్రామ్ గా కూడా పేరు సంపాదించింది. అంతటి మంచి కార్యక్రమం ఎనిమిది సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగింది..చాలా సంవత్సరాలు ప్రోగ్రామ్ కి న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా లు వ్యవహరించారు. అయితే సరిగ్గా ఇక్కడే చిక్కు వచ్చిపడింది. షడన్ గా మల్లెమాల టీవీ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకున్నారు. ఎప్పుడైతే ఆయన తప్పుకున్నాడో..ఫేమస్ టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర లాంటి వారు కూడా తప్పుకున్నారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా కార్యక్రమం నుంచి తప్పుకుంటూ వెళ్లిపోయారు. ఇదంతా చూస్తుంటే కావాలనే ఈటీవీలో అత్యధిక రేటింగ్ వచ్చే ప్రోగ్రామ్ కి మంటపెట్టారనే అనుమానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇటీవలే కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు మల్లెమాలో జరిగిన అవమానాలపై మీడియా ముందుకి వచ్చి చెప్పడంతో..ఆ విషయాన్నా చాలా యూట్యూబ్ ఛానళ్లు ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాలు కూడా పెట్టి గట్టిగానే సొమ్ము చేసుకున్నాయి.

నాగబాబు, రోజా తప్పుకోవడంలో చెదిరిన కళ..
ఈటీవీలో వచ్చే జబర్ధస్త్ అంటే రోజా..నాగబాబే..ప్రేక్షకులకు నవ్వు రాకపోయినా..వారు నవ్వే నవ్వుకి.. బ్యాక్ గ్రౌండ్ డైలాగులకే అందరూ మరీ పగలబడి నవ్వేవారు. ఒకరకంగా చెప్పాలంలే జబర్ధస్త్ లో రోజా, నాగబాబు లేని కార్యక్రమాన్ని ప్రేక్షకులు కూడా పెద్దగా స్వీకరించలేకపోయారు. అలాంటి సమయంలో హైపర్  ఆది, ఆటో రాంప్రసాద్ లాంటివారు తమ స్కిట్ లతో ఏదో అలా రంజింప చేసినా..మిగిలిన వారు చేసే కామెడీ స్కిట్ లలో స్కిట్ తప్పా కామెడీ లేకపోవడం అలాంటి సమయంలోనే అప్పారావు లాంటి కంటెస్టెంట్లు కూడా బయటకు వెళ్లిపోవడంతో మల్లెమాల మూగబోవడం మొదలు పెట్టింది. ఆ సమయంలో కూడా ప్రేక్షకులకు నవ్వు తెప్పెంచేందు మనోలాంటి వారిని న్యాయనిర్ణేతగా తీసుకువచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇటీవలే రోజా కూడా కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో కార్యక్రమం కళమొత్తం కళావిహీనం అయిపోయింది. ఆ తరువాత న్యాయనిర్ణేతలుగా వచ్చిన వారు కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్లలేని పరిస్థితి అయిపోయింది.

జబర్ధస్త్ లో కామెడీ అంటే వాళ్ల తరువాతే..
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కార్యక్రమంలో కామెడీ అంటే హైపర్ ఆది, రైజింగ్ రాజు, సుడిగాలి ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, అప్పారావ్, అవినాష్ లదే. అయితే వీరందరి టీమ్ లలో ఉన్నవారంతా నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో ఆయనతోపాటుగానే మాటీవిలోకి వెళ్లిపోయారు. అక్కడ కామెడీ కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించడంలో విజయం సాధించారు. అదే సమయంలో టీవీలో వచ్చే కార్యక్రమంలో కామెడీ తగ్గిపోవడం, ప్రేక్షకులను మెప్పించే న్యాయనిర్ణేతలు లేకపోవడం, ఒక స్కిట్ లో కనిపించిన వారు మరో స్కిట్ లో కనిపించకపోవడం తదితర కారణాలన్న మల్లెమాల మంటకు నిప్పులో నెయ్యి పోసినట్టు అయ్యాయి. ఎన్ని మార్పులు, చేర్పులు చేసినా జబర్ధస్త్ ని ప్రేక్షకులు మళ్లీ పాత పద్దతిలో ఆదరించే స్థాయికి తీసుకు రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కంటెస్టెంట్, టీమ్ లీడర్లు బయటకు వచ్చి మల్లెమాల చేసిన వ్యవహారాలను వివిధ రకాల యూట్యూబ్ ఛానళ్లలో బయటకు తీసుకు రావడంతో ఆ మంట కకాస్తా మరింత రాజుకున్నట్టు అయ్యింది.

అత్యధిక పారితోషకం ఇచ్చినా ఫలితం సున్నా..
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కార్యక్రమంలో కామెడీ చేసేవారికి అత్యధిక మొత్తంలో పారితోషకాన్ని ఇవ్వాలని మల్లెమాల డిసైడ్ అయినా ఆ స్థాయిలో స్కిట్ లు వేసేవారు కరువైపోయారు. దీనితో జబర్ధస్త్ కార్యక్రమం కాకుండా ఈటీవీలో స్లాట్లు బుక్ చేసుకున్న ఇతర కార్యక్రమాలపై మల్లెమాల ద్రుష్టిపెట్టాల్సి వచ్చింది. ఇటీవలే యాంకర్ అనసూయ, సుధీర్ లాంటి వారు కూడా మరో కార్యక్రమానికి వెళ్లిపోవడంతో..సోలో యాంకరింగ్ కి ఇష్టపడే రష్మీకి సైతం ఇమేజ్ తగ్గుతూ వస్తోందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఒకప్పుడు జబర్ధస్త్ కార్యక్రమం అంటే ఆత్రుతగా ఎదురు చూసేవారంతా ఇపుడు ఆ కార్యక్రమం సుద్ద దండగ అనే స్థాయికి వచ్చేశారు. ఇంకా హైపర్ ఆది..ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను వంటి వారంతా ఏదో పైకి తీసుకు రావాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా కళతప్పి, కళా విహీనంగా మారిన కామెడీ స్కిట్లు వారి మైలేజిని కూడా తగ్గించేస్తున్నాయని చెబుతున్నారు. ఆ కారణంగానే ఈటీవీ జబర్ధస్త్ లో చేసే కమీడియన్లంతా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వెతుక్కుంటా మళ్లీ వెండితెరపై వారి అద్రుష్టాన్ని వెతుక్కుంటున్నారు. చూడాలి ముందు ముందు ఇంకెన్నీ కామెడీ స్కిట్లు చేసే కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లు బయటకు వెళ్లిపోయి మల్లెమాలకు పెట్టిన మంటలో నెయ్యివేస్తారో లేదా పెట్టిన మంటను ఆర్పుతారో..!