వార్నీ.. రాంగోపాల్ వర్మ నువ్వు మామూలోడివి కాదు అంటూ నెటిజన్లు, చిరంజీవి అభిమాన్లు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పెట్టిన వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. మరికొందరు పాపం గరికపాటి నోటిగార వదిలిస్లున్న రాంగోపాల్ వర్మ అంటూ తిరిగి ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకీ అసలు కద చెప్పనే లేదు కదా.. గరికపాటి ఓ ప్రైవేటు టీవీ ఛానల్ లో నెమలి సంభోగం జరగుకుండా కంటి దారతో పిల్లల్ని కంటుందని..అదొక ప్రత్యేక ప్రక్రియ అని చెప్పిన వీడియో క్రింద.. రెండు నెమళ్లు సంభోగాన్ని చేస్తున్నట్టుగా డిజైన్ చేసిన వీడియోని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. దీనితో నెటిజన్లు ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
అంతేకాదు దానికి అనుగుణంగా రక రకాల వీడియోలు గరికిపాటికి వ్యతిరేకంగా పెడుతూ ట్విట్టర్ షేక్ చేస్తున్నారు. ఇటీవల గరికపాటి మెగాస్టార్ చిరంజీవిని సభలో మాట్లాడిన మాటలను కాస్త సీరియస్ గానే తీసుకున్న అభిమానులు నాటి నుంచి నేటి వరకూ ఒక రకంగా గరికపాటిని ఆట ఆడుకుటున్నారు. దానికి బదులుగా గరికపాటి అఫిషియల్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తనపై వచ్చే వీడియోలను నమ్మొద్దని ప్రచారం చేసుకున్నా ఎక్కడా ఫలితం మాత్రం కనిపించలేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి యావత్ సభ లో చేసిన వ్యాఖ్యలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తున్నది. మరీ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మలాంటి క్రియేటివ్ డైరెక్టర్లు ఈ తరహా వీడియోలు పోస్టు చేయడం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది..!