సినిమాలకు విశాఖ మెయిన్ సెంటిమెంట్..గంట్ల


Ens Balu
35
Visakhapatnam
2022-12-06 11:33:29

చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన విశాఖలో సెంటిమెంట్ ఎంతోమంది నటులు అగ్ర తారలుగా అభివృద్ధి చెందారని  శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  పేర్కొన్నారు. ఎస్. ఎస్. ఎల్ .ఎస్. క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న కంచర్ల చిత్రం హీరో ఉపేంద్ర బాబు, హీరోయిన్ మీనాక్షి జెస్వాల్ కు తన ప్రేమ ప్రతిపాదన చేసే సన్నివేశాలను చిత్రీకరణను మంగళవారం శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్ర కథానాయకుడు ఉపేంద్ర కూడా ఈ సెంటిమెంటుతో అగ్ర తారల జాబితాలోకి చేరుకోగలడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 చిత్ర కథానాయకుడు ఉపేంద్ర బాబు మాట్లాడుతూ విశాఖ ప్రజల ఆదరణ ప్రోత్సాహంతో తన తొలి మూవీ" కంచర్ల 'ద్వారా సినీ పరిశ్రమలో చక్కని గుర్తింపును పొందగలనని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తొలి షెడ్యూల్లో అనేక సన్నివేశాలు నాలో ఉత్సాహాన్ని మరింత రేకెత్తించాయి అన్నారు. రెండవ షెడ్యూల్ కూడా సర వేగంగా చిత్రీకరణ జరుగుతున్నదని పేర్కొన్నారు. చిత్ర దర్శకులు యాద కుమార్ మాట్లాడుతూ ఎస్ .ఎస్. ఎల్ .ఎస్. క్రియేషన్స్ నిర్మాత కంచర్ల అచ్యుత రావు చిత్రీకరణలో ఎక్కడ రాజీ పడకుండా తమ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని  తెలుగు ప్రేక్షకులకు కానుకగా అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.

కొత్త వారైనప్పటికీ హీరో ఉపేంద్ర చక్కని హావభావాలతో ,హీరోయిన్ మీనాక్షి జస్వాల్ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే విధంగా నటిస్తున్నారన్నారు. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ ప్రేమ, కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకులకు దూరమవుతున్న తరుణంలో S.S.L.S. క్రియేషన్స్ ఒక సాంప్రదాయ ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించడానికి ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మేనేజర్ బాలగంగాధర్, కెమెరామెన్ గుణశేఖర్, జబర్దస్త్ నిహాన్, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, పార్క్ అద్యక్షులు సనపల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.