లైగర్ చిత్రానికి పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గట్టిగానే పట్టుబట్టి వివరాలు లాగుతోంది. దీనికోసం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి చిత్ర దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించింది. తాజాగా శుక్రవారం సినీ ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు చెబుతున్నారు. లైగర్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా బోల్తాపడి నష్టాలు వచ్చిన తరువాత కూడా ఈడీ సినిమాకి చెందిన పెట్టుబడులపై గట్టిగానే బుర్రపెట్టి వివరాలు లాగుతోంది.
ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీశారట. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారాల్లో మరికొందరుని ఈడీ త్వరలో ప్రశ్నించ నున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. తన పని తాను చల్లగా చేసుకుపోతున్న ఈడీ విచారణ విషయంలో మాత్రం విషయాన్ని బయటకు రానీయకుండా ఎక్కడా ప్రకటనలు చేయకుండా మాత్రం జాగ్రత్తపడుతోంది. ఇలా ప్రకటన చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడా లైగర్ విషయంలో ఈడీ ఇంకెంత మందిని ప్రశ్నించి ఎలాంటి సమాచారం రాబడుతుందనేది.