బాలీవుడ్ అగ్రతార ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతుర్ని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్, ప్రియాంక చోప్రాలు 2018న ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా ప్రియాంక బిడ్డను కన్నారు. అయితే అప్పటి నుంచి ఇంతవరకు కూతురు మాల్తీ మేరీ ఫేస్‌ను చూపించలేదు. కానీ రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ప్రియాంక తన గారాలపట్టి మాల్తీతో కలిసి వేడుకలకు హాజరై ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త వైరల్ అవుతున్నాయి. చాలా వరకూ సినిమా తారలు స్వయంగా కాకుండా సరోగసీ ద్వారానే పిల్లలను కనడం పరిపాటిగా మారింది..!