యాపిల్ బ్యూటీ హన్షిక.. ఆ7ఏళ్లకథ రహస్యాన్ని చెప్పేసింది


Ens Balu
26
Hyderabad
2023-02-20 08:32:41

విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన యాపిల్ బ్యూటీ హీరోయిన్‌ హన్సిక  తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాతన ఈ అమ్మడు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోహైల్‌ కథూరి యాను వివాహం చేసుకుని వివాహబంధంలోకి ప్రవేశించిది. ఆ తరువాత మీడియా ముందుకి వచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో  తమ ప్రేమ వివాహం వెనుక అసలు రహస్యాన్ని చెప్పింది. సోహైల్‌ ప్రేమను తాను అంగీకరించడానికి ఏడేళ్ల సమయం పట్టిందని.. బాంబు పేల్చింది.

‘‘తాను స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశాను. బ్రేకప్‌ తర్వాత మరొకరికి ఓకే చెప్పి వాళ్ల ప్రేమను మనస్పూర్తిగా అంగీకరించేందుకు 7 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై ఎంతో నమ్మకం ఉంది. స్వచ్ఛమై ప్రేమను పంచుకునే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం తీసుకున్నాను. సోహైల్‌ కథూరియా కూడా నా ప్రేమ కోసం కూడా ఎంతో ఎదరుచూశాడు అంటూ చెప్పుకొచ్చింది. తను నన్ను ఎంతగా ప్రేమిస్తాడో మాటల్లో చెప్పలేనని.. అది అనుభవించిన నాకు మాత్రమే తెలుస్తుందని’’ అని చెప్పింది. తన ఓల్డ్‌  రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ అలాంటివి పెద్దగా గుర్తుంచుకునేవి కాదు..పనికిరాని విషయాలను ఎవరైనా గుర్తుంచుకుంటారా అంటూ కాస్త చిరాకు కూడా ప్రదర్శించింది. ప్రస్తుతం దేవుడు నాకు మంచి దారి చూపించాడు. ప్రతి ఒక్కరి జీవితానికి ఓ కొత్త ప్రారంభం ఉంటుందని నేను నమ్ముతాను’’అంది.

హన్సిక వివాహ వేడుక ‘లవ్‌ షాదీ డ్రామా’పేరుతో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో తన కెరీర్‌లో ఎదురైన అనేక అనుభవాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను హన్సిక చాలా ఎక్కువగానే ప్రేక్షకులతో పంచుకుంది. కథానాయికగా హన్సిక ఎంట్రీ ఇచ్చే క్రమంలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు అప్పట్లో వచ్చిన వార్తలపైనా కూడా ఆమె స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదని తెలిపింది. వాళ్ల సోషల్ మీడియా హైప్ కోసం ఏవేవో రాస్తే దానిపై స్పందించాలా .. ఆ వార్తలన్నీ ఫేక్ అని, ఒకానొక సమయంలో మీడియా ఇలా నీచంగా ప్రవర్తిస్తుందానే అసహనాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం హన్సిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘పార్ట్‌నర్‌’,‘105 మినట్స్‌’ చిత్రాల షూటింగ్‌ పూర్తి కాగా, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘గాంధారి’ తదితర చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. పెళ్లి తరువాత కూడా హన్షిక సినిమాలు అదరగొడుతుంది. అవి బాక్సాఫిసు దగ్గర విజయం సాధించాలని కోరుకుందాం..!