దసరా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని ప్రముఖ హీరో నాని పేర్కొన్నారు. చిత్ర ప్రమో షన్ లో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరోయిన్ కీర్తి సురేష్ తో తాను నేను లోకల్ సినిమా తరువాత చేసిన రెండో చిత్రం అన్నారు. ఈ సినిమా ఈనెల 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రేక్షకులు ఈ నెల 30 నుంచి ఒక పుష్ప, ఒక కేజీ ఎఫ్ -2 మాదిరిగానే దసరా సినిమా గురించి మాట్లాడు తారు అన్నారు. సినిమా లో అంత బలమైన, నమ్మకమైన కంటెంట్ వుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ సినిమా బాగా తీశారు అన్నారు. పాటలుకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది అన్నారు. సంతోష్ నారాయణ మంచి సంగీతం అందించారు అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు. మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.