నేను బ్రతికే ఉన్నాను అపుడే చంపేయకండి..కోటా


Ens Balu
45
Hyderabad
2023-03-21 06:21:02

హైప్ కోసం సోషల్ మీడియా వేసే వేషాలు ఇన్నీ అన్నీకాదు..సుబ్బరంగా ఉన్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు  మృతిచెందారంటూ కొన్ని సోషల్ మీడియా న్యూస్ యాప్స్ ఉదయం నుంచి ఊదరగొట్టాయి. దీనితో బాబోయ్ నేను బ్రతికే ఉన్నానని నేరుగా కోటశ్రీనివాసరావే ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. విశేషం ఏంటంటే ఆ వీడియోని కూడా మళ్లీ అదే సోషల్ మీడియాలో ప్లే చేశారు..పైగా ఆయన బ్రతికే ఉన్నారంట అని తేడా హెడ్డింగులు సైతం పెట్టడం విశేషం. దీనిపై స్పందించిన కోట శ్రీనివాసరావు. మంచి విషయాలు, ప్రజలకు పనికొచ్చే విషయాల కోసం హైప్ క్రియేట్ చేయండి తప్పా ఇలాంటి వార్తలొద్దని సున్నితంగా మందలించారు. పైగా తాను చనిపోయానని తెలిసి మా ఇంటికి ఓ పదిమంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం వచ్చారని, ఆ తప్పుడు వార్తతో నేను వచ్చిన అన్ని ఫోన్ కాల్స్ కి సమాధానం చెప్పలేక నిజంగా చచ్చానని తప్పుడు వార్తలు ప్రచారం చేసిన సోషల్ మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..