నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం..


Ens Balu
3
Hyderabad
2020-10-24 21:01:09

 కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్‌  ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమార్తె శివానీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. ‘‘సిటీ న్యూరో సెంటర్‌లోని డాక్టర్‌ కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం మా తండ్రిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మా తండ్రి కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు’’ అని శివానీ ట్వీట్‌ చేశారు. మరోవైపు సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు సైతం రాజశేఖర్‌ ఆరోగ్యంపై బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరిన డాక్టర్‌ రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రాజశేఖర్‌ కూడా మా టీమ్‌ అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. ఇక కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన రాజశేఖర్‌ సతీమణి జీవిత సైతం కోలుకున్నారు. ఈ రోజు ఆమెకు చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జీ చేశాం’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.