కరాబ్ శంకర్ ప్రేక్షుల మదిని దోచుకుంటుంది..


Ens Balu
4
విజెెఎఫ్ ప్రెస్ క్లబ్
2020-11-07 18:28:08

మంచి కధాంశంతో రూపొందిన "కరాబ్ శంకర్" చిత్రం ఘన విజయం సాధించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆకాక్షించారు. చిత్రం పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ తో కలిసి గంట్ల మీడియాతో మాట్లాడారు. అందాల విశాఖలో తీసిన ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయని ఈ చిత్రం కూడా మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు.  కరాబ్ శంకర్ షార్ట్ ఫిల్మ్  విడుదలకు సిద్ధమైందని విశాఖకు చెందిన డైరెక్టర్ రాబిన్ గణేష్ చెప్పారు.  కన్నడ నటుడు గంధర్వ రాజ్ హీరోగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని విశాఖ పరిసరాల్లోనే నిర్మించామన్నారు. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామన్నఆయన  30 నిముషాల నిడివి గల ఈ చిత్రంలో విజయవాడ కి చెందిన  టీవీ ఆర్టిస్ట్  విజయలక్ష్మి హీరోయిన్ గా నటించారని చెప్పారు. హీరో గంధర్వ రాజ్ మాట్లాడుతూ, విశాఖ వాసులతో  కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాయినాధ కళాసమితి కూచిపూడి నాట్య గురువు డా..అరుణ్ సాయికుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రివ్యూ ఈ సాయంత్రం (శనివారం ) ఆరు గంటలకు  నగరం లోని పబ్లిక్ లైబ్రరీలో ప్రదర్శించినట్టు చెప్పారు. నిర్మాత కస్తూరిబాయ్ మాట్లాడుతూ, కొత్త కధనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన తమ కుమారుడు గంధర్వ రాజ్ ని ఆశీర్వదించాలని కోరారు. హీరో తండ్రి  ఈశ్వర్ దామెర్ల మాట్లాడుతూ, తాము కూడా తెలుగు వాళ్లమేనని,  తమ పూర్వికులు మైసూర్ లో స్థిర పడ్డారన్నారు. విజేఎఫ్ కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ, అద్భుతమైన టాలెంట్ కన్నడిగుల సొంతమన్నారు. ఇదే బృందం నేతృత్వంలో  వచ్చే ఏడాది మరో చిత్రం తీయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.  విజేఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్  మాట్లాడుతూ.. చిత్రం యూనిట్ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ఈ సమావేశంలో వినియోగదారుల రాష్ష్ట్ర మహిళా చైర్మన్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.