పాండురంగ మహత్యం @ 63 వసంతాలు


Naveen Prasad
2
సినిమా న్యూస్ డెస్క్
2020-11-28 10:10:48

విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు పుండరీకునిగా నట విశ్వరూపం చూపిన చిత్రం "పాండురంగ మహత్యం " ఈచిత్రం విడుదల తేదీ 28-11-1957 . NTR హీరోగా నటించిన భారీ చిత్రం "చంద్రహారం " ద్వారా దర్శకునిగా పరిచయ అయ్యారు కమలాకర కామేశ్వరరావు. వీరిద్దరి కాంబినేషన్లోనే ద్వితీయ చిత్రం "పెంకి పెళ్ళాం" విడుదల అయ్యింది . ఈ రెండు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి . గానీ నందమూరి సోదరులు కమలాకర కామేశ్వరరావు లోని ప్రతిభను గుర్తించి మూడో చిత్రంగా "పాండురంగ మహత్యం " చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ చిత్రం నుండే కమలాకర కామేశ్వర రావు కి పౌరాణిక బ్రహ్మ గా గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో పుండరీకుని తల్లిదండ్రులుగా రుష్యేంద్రమణి , నాగయ్య సోదరుడు గా పద్మనాభం నటించారు . కొన్ని చిత్రాలలో గయ్యాళి పాత్రలను పోషించిన అంజలీదేవి ఈ చిత్రంలో శృంగార తారగా గా నటించారు . ఈ చిత్రంతోనే బి.సరోజాదేవి వెండితెరపై వెలుగులు వెదజల్లారు. ఘంటసాల గాత్రం, టి.వి.రాజు సంగీతంతో వీనుల విందైన పాటలు సమకూరాయి.ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఘన విజయం సాధించింది .