"కాలం మారింది" @ 48 Years
Naveen Prasad
3
సినిమా న్యూస్ డెస్క్
2020-12-01 11:49:22
నటభూషణ శోభన్ బాబు , ఊర్వశి శారద అపూర్వంగా నటించిన చిత్రం "కాలం మారింది ". మమత ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం ఈ చిత్రాన్ని నిర్మించారు. కులమతాల కథాంశంతో నిర్మించారు . కన్నడంలో నిర్మించబడిన "కలంమాల్" ఈ చిత్రానికి మాతృక . హైద్రాబాద్ వెంకటేష్ 70M.M. థియేటర్లో వందరోజులు డైరెక్టుగా ప్రదర్శింపబడింది.
ఉత్తమ నటుడిగా శోభన్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం వారిచే బంగారు నందిని పొందారు . అలాగే ఈ చిత్రం ఉత్తమ కధాచిత్రంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంవారిచెే ఎన్నిక అయ్యింది . ఈ చిత్రం విడుదల తే 01-12-1972 దీ . నేటికి ఈ చిత్రం విడుదల అయి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ పాత మధురాలను అందించే కార్యక్రమంలో భాగంగా ఈఎన్ఎస్ లైవ్ సినిమా విభాగం సినిమా ప్రేమికుల కోసం ఏరికోరి పాత చిత్రాలు, వాటి యొక్క విశిష్టతను తెలియజేస్తోంది.