సాయి ప్రియ రిసార్ట్స్ లో భారీ చోరీ..
Ens Balu
4
Visakhapatnam
2020-12-24 20:02:06
విశాఖ నగర శివారులోని సాయి ప్రియ రిసార్ట్స్ లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 53 తులాల బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పి పి ఎం పాలెం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయి ప్రియ రిసార్ట్స్ లో ఓ పెళ్లి శుభకార్యం నిమిత్తం వధూవరులు వారి కుటుంబీకులు బుధవారం సాయంత్రం సాయి ప్రియ రిసార్ట్స్ లో బసచేశారు. నగరంలోని ఒక ఎమ్మార్వో కొడుకుకి అనకాపల్లి మునగపాక మండలం తోటాడ గ్రామం సిరసపల్లి ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకి సాయి ప్రియ రిసార్ట్స్ లో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల కుటుంబీకులు బుధవారం సాయంత్రం సాయి ప్రియ రిసార్ట్స్ లో బసచేశారు. రాత్రి 12 గంటల వరకు పెళ్లి వారంతా మేల్కొని ఉన్నారు. ఒంటి గంట ప్రాంతంలో నిద్ర లో ఉండగా అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో 301 రూమ్ నెంబర్ లోగల పెళ్లి కుమార్తె కు చెందిన 53 తులాలు బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని పేర్కొన్నారు. బాధితులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీకి పాల్పడింది లోకల్ దొంగల పనేనని పోలీసులు భావిస్తున్నారు.