కరోనాను ఓడించిన నాన్ స్టాఫ్ ఆన్లైన్ సంగీత శిక్షణ..


Ens Balu
11
Visakhapatnam
2021-02-20 11:45:07

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ కకావికలు చేస్తే...అదే కరోనా వైరస్ ప్రముఖ సంగీత దర్శకులు డాక్టర్ మహర్షి(జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి) రూపంలో విశాఖలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో సంగీత కళాకారులుగా మార్చింది. ఇంటి నుంచి కాలు కదపడానికి వీలుపడని రోజుల నుంచి జనజీవనం అంతా కలిసి తిరిగే పరిస్థితి వచ్చేలోపు అంటే సుమారు ఏకదాటిగా 320 రోజుల పాటు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సంగీత పాఠాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడి మరెందరో తమని తాము గాయకులుగానూ, ఇనిస్ట్రుమెంట్ ఆర్టిస్టులను గానూ మలచుకోవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారింది. జాన్ క్రిష్టోఫర్ అంటేనే ఒక సంగీతం..ఆయనను మరోపేరుతో పిలచే మహర్షి అంటేన ఒక గమకం..అన్నీ వెరసీ కళాకారులను సంగీత సాధనలోనూ, వివిధ రకాల వాయిద్య పరికాలను అలవోకగా వాయించే మ్యుజీషియన్లుగాను తయారు చేసి భారతదేశంలోనే ఒక రికార్డును స్రుష్టించింది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆన్లైన్ క్రైస్థవ సంగీత శిక్షణ కరోనాను ఓడించిందా అన్నట్టు నిర్విరామం సాగడం విశేషం.. ప్రస్తుతం రికార్డులు నమోదు చేసే జాతీయ స్థాయి సంస్థలు డా.మహర్షి(జాన్ క్రిష్టఫర్) నాన్ స్టాప్ ఆన్లైన్ మ్యూజిక్ ట్రైనింగ్ రికార్డును నమోదు చేయాలని కూడా చూస్తున్నాయి. క్రిష్టియన్ శాస్త్రీయ సంగీతాన్ని ఔత్సాహిక గాయకులకు నేర్పి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దాలనే ఆయన తపనకు కరోనా వైరస్ వేదిక కల్పించింది. హోమో ఐసోలేషన్ లో ఏమీ పాలుపోకుండా ఉండేవారందరూ ఈయన నేర్పే సంగీతాన్ని ఆన్ లైన్ ద్వారా నేర్చుకొని మంచి ప్రావీణ్యత సాధించారు. ఎప్పుడూ వైవిధ్య భరిత వార్తల్లో నిలిచే ఈ ప్రముఖ సంగీతదర్శకులు కళను బ్రతికించడానికి, కాళాకారులను తయారు చేయడానికి చేస్తున్న తపన అంతా ఇంతా కాదు. ఆ వివరాలు తెలుసుకుంటే.. ప్రముఖ సంగీత దర్శకులు డా. మహర్షి (జాన్ క్రిస్టఫర్ కొమ్మలపూడి)  విశాఖ నగరం లో  2003 6వతేదీన ట్రినిటీ చర్చ్ లో, సంఘ కాపరులు, పెద్దలు, యవనస్థుల సమక్షంలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ని స్థాపించారు. క్రైస్తవులు శాస్త్రీయ సంగీతం నేర్చుకునే అవకాశం లేక సరియైన పద్దతిలో చెప్పేవారు.. ప్రోత్సహించే వారు.. లేక శాస్త్రీయ సంగీతాన్ని క్రైస్తవ సాహిత్యంతో, క్రైస్తవ విశ్వాసంతో నేర్చుకోవాలనే "తృష్ణ" కలిగిన పెద్దలు, యవనస్థులు, పిల్లలు ఎన్నో సంవత్సరాలుగా ఆ విద్యకు దూరమైన సంధర్భాలలో మహర్షి గారి  40 సంవత్సరాల సంగీత అనుభవముతో  "క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం" అనే గ్రంధాన్ని రచించి, క్రైస్తవ విశ్వాసం, క్రమశిక్షణా మార్గంలో అనేక గీతాలు, రాగమాలికలు, కృతులు రచించి స్బ్వరకల్పన చేసి, శాస్త్రీయ సంగీతం నేర్చుకొనే పద్ధతులతోనూ, విధానాలతోనూ ఒక పాఠ్యాంశంగా దానిని రూపొందించారు. ప్రముఖ క్రైస్తవ సంఘ కాపరులు, పెద్దలు ఆ గ్రంధానికి ముందు మాటలు రాసి ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చారు. దానిని పాఠ్యాంశంగా "క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్" లో జాయిన్ అయిన చిన్న, పెద్దలకు శాస్త్రీయ సంగీతాన్ని మహర్షి గారు బోధించడం ప్రారంభించానరు. స్వంత బిల్డింగ్ లేకపోయినా, సంఘ కాపరులు, సంఘ పెద్దలు ఆయనకు  అండగా నిలిచి వారి చర్చెస్ లో నే "క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్" కి స్థానం కల్పించారు. అలా ప్రారంభమయిన ఈ సంస్థ దినదినాభివ్రుద్ధి చెందింది. ఈ కాలేజ్ లో నేర్చుకున్న విధ్యార్ధులతో "వర్షిప్ కాన్సర్ట్స్" ను ఎంతో వైభవంగా విశాఖ నిర్వహించడం విశేషం. అంతే కాకుండా ప్రముఖ క్రైస్తవ వాగ్గేయ కారులు రచించి స్వరపరచిన, ఎంతో ప్రాముఖ్యత నంతరించుకున్న "ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు" "శాస్త్రీయతను తీసుకొని వచ్చి" ఒక గ్రంధం గా మలచాలనే దైవ సంకల్పంతో ఆ కీర్తనలకు ఇటు కర్ణాటక, వెస్ట్రన్ నొటేషన్స్ వ్రాయాలని తలంచి దాదాపు 200 కీర్తనలకు స్వరాలు ఆ పుస్తకంలో రాశారు. వీటిని శాస్త్రోక్తంగా విద్యార్ధులకు నేర్పి తిరిగి ఆ కీర్తనలు ప్రతీ చర్చ్ లోనూ స్వరబధ్ధంగా పాడించాలనే ఉద్దేశంలో ఉండగా అనుకోని విధంగా ఈ కరోన వ్యాధి వలన విధ్యార్ధులు నేర్చుకోవడానికి రావడం కష్టతరమయ్యింది. ఆ సమయంలో పాస్టర్ షాలేం గారు (డైరెక్టర్, జీవ జలములు) "జూం"  ఆన్ లైన్ లో వాక్యోపదేశం ప్రారంభించి మీరు కూడా ఇలా ఆన్ లైన్ లో క్లాసులు తీసుకొండి అని సలహా చెప్పి ఆయన "జూం" నుండి మహర్షి గారికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు. దీనితో 15-4-2020, న ఆయన  ప్రారంభించిన ఆన్ లైన్ వోకల్ క్లాసుకు మొట్టమొదట్టి సారిగా ఎంతో మంది చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా జాయిన్ అయ్యి శాస్త్రీయ సంగీతం యొక్క మెళకువలను నేర్చుకోవడం ప్రారంభించారు. అలా ప్రారంభమైన ఈ క్లాసులు ఆన్ లైన్ లో చీన్న వాళ్ళకు 200 వ రోజులు, మరియు పెద్దవాళ్ళకు 300 రోజులు పూర్తయ్యాయి. సంగీత స్వరాల ఆవిర్భావం, వివిధ రాగ లక్షణాలు, తాళ ప్రక్రియలు బాగా తెలుసుకొని అర్ధం చేసుకొనీ స్పష్టమైన స్వరాలతో ఆ రాగ తాళములకు అణుగుణంగా "ఆంధ్ర క్రీస్తవ కీర్తనలు" మరియు ఆయన రాసి స్వరపరచిన గీతాలు, రాగమాలికలు, కృతులు నేర్చుకుంటూ ఈ రోజు విధ్యార్ధులు 300 వ రోజు సంబరాన్ని చేసుకుంటున్నారు. ఎంత అద్భుతం. ఇది కేవలం దేవుని ప్రణాలిక అని ఇక ఆగని సంగీత జీవ నది ప్రవాహమని, ఒక్కొక్క విధ్యార్షి ఒక్కొక్క శాస్త్రీయ సంగీత ఉపాధ్యాయులుగా మారి క్రైస్తవ శాస్త్రీయ సంగీతానికి ఒక కొత్త జీవాన్ని వెలుగును తీసుకొని వస్తారనీ ప్రముఖుల ప్రశంశలు అందుకున్న ఈ తరుణంలో ఈ 300 వ రోజు (08-02-2021 సోమవారం)  "క్రైస్తవ శాస్త్రీయ సంగీత పండుగ  అందరినీ అలరించింది. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది జాయిన్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అతిధులుగా వచ్చిన ప్రముఖ రచయిత, కవి, పండితులు, తాతపూడి రాజేష్ , ప్రముఖ గాస్పెల్ గాయకులు, సాహితీ రత్న ఆకుమర్తి డేనియల్  వారి గ్రీటింగ్స్ తెలియచేసి మహర్షి గారినీ, అద్భుతం గా పాడిన పిల్లలను, పెద్దలను అభినందించి మహర్షి  చేస్తున్న ఈ సంగీత సేవ ఒక "యజ్ఞమనీ నిరంతర సంగీత ప్రవాహమనీ, ఇది కేవలం దైవ సంకల్పమనీ కొనియాడారు. పెద్దలు డా. శేమ్యూల్ సొంగా, ఆశీర్వాదం, యు.కె నుండి హాజరయ్యిన ఎబినేజర్ , సిస్టర్ రూత్  అందరికీ తమ శుభాకాంక్షలు తెలియచేసారు. తాతపూడి రాజేష్  మాట్లాడుత్తు త్వరలొ నాలుగు ప్రాంతాలలో, విశఖపట్టణం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ నగరాలలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఫిజికల్ బిల్డింగ్స్ రావాలనీ దానికి కృషి చేస్తామనీ అంతేకాకుండా "ఆంధ్ర క్రీస్తవ కీర్తనలను  "క్రైస్తవ శాస్త్రీయ సంగీత గ్రంధంగా" తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియచేసారు. ఈ విషయాలను దృష్టిలో వుంచుకొని అందరూ తమ తమ ప్రార్ధనలో దేవునికి విజ్ఞాపన చేయాలని కోరారు. దీనంతటికీ ప్రోత్సహిస్తూ వెన్నంటి నడిపిస్తున్న “జీవ జలములు రేడియో , మీడియా మినిస్ట్రీస్, విశాఖపట్టణము, అధినేత పాస్టర్ షాలేమ్ ఇజ్రాయేల్ మహర్షి , సభ్యులతో పాటు వచ్చిన అతిధిలు ఎంతగానో ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరస్తులు, సభ్యులు, క్రిష్టియన్ సంగీత కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.