ప్లాస్మా దానానికి ఐజీజీ లెవల్స్ అడ్డొచ్చాయ్..రాజమౌళి


Ens Balu
2
Hyderabad
2020-09-01 14:31:29

కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ఆపదలో వున్నవారి ప్రాణాలను కాపాడిన వారవుతారని విలక్షణ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్విటర్‌ ద్వారా కోరారు. కరోనా నుంచి కోలుకున్నవారి శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని, ఆలోగానే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ప్లాస్మా దానం చేయడానికి తన శరీరంలో యాంటీ బాడీస్‌ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని వైద్యులు తెలిపారని వివరించారు.  అందుకే తాను ప్లాస్మా దానం చేయలేద న్నారు. అయితే తన  పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం  ప్లాస్మా దానం చేయడం ఆనందంగా వుందన్నారు. ఐజీజీ లెవల్స్ పెరగగానే తాను ప్లాస్మా దానం చేస్తానని  రాజమౌళి ప్రకటించారు. కరోనా నుంచి కోలుకున్నవారం నేరుగా ప్లాస్మా దానం చేయడానికి వెళ్లపోకుండా ముందర ఐజీజీ లెవల్స్ ను పరీక్షించుకున్న తరువాత మాత్రమే దానానికి సిద్ధ పడాలని కూడా హెచ్చరించారు.