‘మా’సభ్యత్వానికి ప్రకాష్ రాజా గుడ్ బయ్..


Ens Balu
7
Film Nagar
2021-10-11 07:42:25

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు సోమవారం ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అనంతరం ప్రకాష్ రాజ్  మీడియాతో మాట్లాడుతూ, 'మా' ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలియజేశానని.. మా ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు. 'నేను తెలుగు వాడిని కాదు.. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు.. అందుకే  తెలుగుబిడ్డను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 'మా' తో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చారు. అతిథిగానే వచ్చాను.. అతిథిగానే ఉంటాను.. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా అని చెప్పారు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. ఇలాంటి ఎజెండా ఉన్న అసోసియేషన్ లో నేను ఉండలేను. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. నన్ను నాన్‌ లోకల్ అన్న కోట, రవిబాబు మాటల్ని గౌరవిస్తా. లోకల్‌, నాన్‌ లోకల్ అజెండాల మధ్య ఉండలేను. మా సభ్యత్వం లేకుంటే సినిమాలు చేయనివ్వరా?' అని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను ఇక్కడే వుంటాను తప్ప..మాలో మాత్రం ఉండలేనని స్పష్టం చేశారు..