ఎంతటి బాన పొట్టనైనా ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద వైద్య విధానం, ఇంట్లో దొరికే దినుసలతోనే ఇట్టే కరిగించుకోవచ్చు. ఏంటి నమ్మకం లేదా..ఓహో మీరు నెలకి పది నుంచి 20వేలు పెట్టి కొన్న ప్రోడక్ట్స్ వాడితే తప్పా మీకు నమ్మకం రాదన్నమాట. అలా అనుకుంటే మీరు ఆ ఖరీదైన ఉత్పత్తులు వాడినపుడు మాత్రమే బరువు తగ్గుతారు. మానేస్తే యధావిధిగా పెరిగిపోతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. అదే ఆయుర్వేద జీవన విధానంలో వాడే మూలికలు వినియోగించడం ద్వారా ఆరోగ్యంగా మీ బరువును తగ్గించుకోవడంతోపాటు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన శరీర బరువుని మన అదుపులోనే ఉంచుకోవచ్చు. అందులోనూ ఈ వెయిట్ లాస్ ఫార్ములా వినియోగించడానికి అన్ని వస్తువులు మన ఇంట్లో దొరికేవే అంటే మీకూ ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఇంట్లోనే దొరికే ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా మీ శరీర బరువుని, అపారంగా పెరిగిపోయిన బాన పొట్టను ఇట్టే తగ్గించుకోండి. ఆ ఆయుర్వేద ఉత్పత్తులు ఏంటి..వాడే విధానం తెలుసుకోండి. ఆరోగ్య కరంగా మీ శరీర బరువుని తగ్గించుకోండి. ఆ సమాచారాన్ని ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అమ్మాయిలు, అబ్బాయిలే కాదు పెద్దవారిని సైతం ఈ అధిక బరువు చాలా ఇబ్బందులు, అనారోగ్యాల పాలు చేస్తోంది. దీనితో బరువు మొత్తం తగ్గిపోయి స్లిమ్, ట్రిమ్ గా ఉండటానికి ప్రతీ ఒక్కరూ నానా రకాల ఉత్పత్తులు వినియోగించాల్సి వస్తుంది. ఆ ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవి కావడంతో వాటిని అన్ని వర్గాల ప్రజలు వినియోగించే పరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది అధిక బరువు, బాన పొట్ట, పొట్టచుట్టూ కొవ్వు పేరుకు పోతున్నాయి. దానికి ఇంట్లోనే ఎక్కువ సేపు ఉండటం, శరీరానికి వ్యాయం లేకపోవడం, కార్యాలయాలల్లోనూ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వలన వచ్చిన పొట్ట తరగడం లేదు సరికదా.. దాని బరువు రోజు రోజుకూ పెరిగిపోతూ వస్తున్నది. దీనితో చాలా మంది అధిక బరువుతో ఎక్కడాలేని కొత్తరోగాలన్నీ కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బరువు తగ్గేందుకు వినియోగించే ఔషదాలు
మన శరీరంలో అత్యం ఎక్కువగా పేరుకు పోయిన కొవ్వు వలన భారీ స్తూలకాయంతో పెరుగుతున్న బరువుని మన ఇంట్లోనే దొరికే ఆయుర్వేద ఉత్పత్తులతో చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. దానికి కావాల్సిన ముఖ్యమైన ఆరింటికోసం ఇపుడు తెలుసుకుందాం. మొదటిది సొంటి ఇది కొవ్వుని కరిగించడంతో రారాజుగా పనిచేస్తుంది. రెండవది మిరియాలు..దీనికి కూడా పొట్టలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపే గుణం వుంది. మూడవది సైంధవ లవణం..ఇది కొవ్వుని చమట రూపంలో బయటకు పంపే ప్రక్రియను చాలా చక్కగా చేస్తుంది. నాల్గవది జీలకర్ర.. దీనిని మనం ఎక్కువ కూరల్లో వినియోగిస్తుంటాం. దీనికి కూడా బరువుని తగ్గించే గుణాలు అపారంగా ఉంటాయి. ఇక ఐదవది పిప్పళ్లు..పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని ముక్కలు ముక్కలుగా కోసేయడంలో దీనికి ఇదే సాటి. ఆఖరిగా ఆవు పాలతో చేసిన మజ్జిగ. ఈ మజ్జిగలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. వీటన్నింటిని సమబాగాలు తీసుకొని బాగా మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఆపై ఒక పావు చెంచా పొడిని ప్రతీ రోజూ దంతదావణం పూర్తయిన తరువాత ఏమీ తినకుండా పరగడుపున ఒక గ్లాసు, సాయంత్రం భోజనానికి ముందు మరో గ్లాసు మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఆ తరువాత కనీసం రెండు గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఆ పొడి కలిపిన మజ్జిగ తాగిన తరువాత వాకింగ్ గానీ, వ్యాయామం కానీ చేయడం ద్వారా ఫలితం చాలా త్వరగా వస్తుందని మాత్రం మరిచిపోవద్దు. ఆ ఫలితాన్ని మీరు పొడి వాడిన తొలిరోజు బరువు తూకం వేసుకొని చూసుకోవచ్చు. ఆ తరువాత సరిగ్గా 15 రోజులకు మరోసారి తూకం వేసుకుంటే తేడా మీరే గమనించవచ్చు.
ఈ పొడి తీసుకునే సమయంలో తినకూడని పదార్ధాలివే..
త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ఈ పొడి తీసుకునే రోజుల్లో అస్సలు తీపి, పంచాదారతో చేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి.. దూరంగా ఉండటం ఏంటీ మానేయాలి అదైతే ఖచ్చితంగా జరగాలి. అంతేకాకుండా మటన్, నూడిల్స్, బర్గర్, పీజ్జా లాంటి జంక్ ఫుడ్ కి చాలా దూరంగా ఉండాలి. మళ్లీ మటన్ బోన్స్ సూప్ త్రాగవచ్చు ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. చికెన్, ఫిష్ సమ్రుద్దిగా తినవచ్చు. వీటిలో మంచి ప్రొటీన్ ఉండటం వలన మర శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ సమస్య రాకుండా వుంటుంది. ప్రొటీన్ సమస్య రాకుండా చేస్తుంది. రాత్రి సమయంలో అవకాశం వున్న వారు జొన్న రొట్టెలను తీసుకుంటే ఆకలి మందగిస్తుంది. అంతేకాకుండా వీలైనంత వరకూ మజ్జిగను పలుచగా చేసుకొని త్రాడానికి ప్రయత్నించాలి. ఉదయం లేచిన వెంటనే లీటరు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. సమయం దొరికినపుడల్లా వేడినీరు తీసుకోవడం, ఉదయం, సాయత్రం స్నానం చేసే సమయంలో వేడినీటితో స్నానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పైన పేర్కొన్నట్టుగా చెప్పవన్నీ పాటిస్తే మీకు ఫలితం 15 రోజులకే ప్రారంభం అవుతుంది. సరిగ్గా మూడు నెలల్లో మీరు అనుకున్న బరువు తగ్గిపోవడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుంది. పురాతన కాలం నుంచి వస్తున్న ఆయుర్వేద వైద్య విధానాలు మానవుని శరీరంలో క్రమం తప్పకండా 41 రోజులు అంటే మండల పాటు వినియోగిస్తే ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వేల రూపాయలు ఖర్చు చేసి..అనారోగ్యాలు తెచ్చే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కంటే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ పద్దతిని పాటించి చాలా చక్కగా బరువు తగ్గవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వేలకు వేలు ఖర్చు చేసే కంటే అతి తక్కువ ఖర్చుతో శాస్త్రీయ పద్దతితో మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వుని బయటకు పంపి ఆరోగ్యంగా ఉండండి.. చక్కగా బరువు తగ్గండి.. ఆరోగ్యమస్తు..!