కేన్సర్ వ్యాధిపట్ల అందరూ అవగాహన కలిగిఉండాలి


Ens Balu
58
Visakhapatnam
2023-02-04 05:44:53

కేన్సర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, జిల్లాఇన్ ఛార్జ్ మంత్రి విడదలరజని పిలుపునిచ్చారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ఆర్.కె. బీచ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రి, గీతం, సిఐఐ, మరియు పలు ఎన్.జి.ఓ. సంస్థలు ఏర్పాటు చేసిన వాక్ మారథాన్ కార్యక్రమానికి శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేన్సర్ వ్యాధితో ఎంతో మంది  పోరాడుతున్నారన్నారని, కేన్సర్ వ్యాధి మానవులను కబళిస్తోందన్నారు.  ఒక కోటి మంది వరకు కేన్సర్ తో చనిపోయినట్లు చెప్పారు.  భవిష్యత్తులో మరింత మందిని కబళిస్తుందన్నారు.  మనం తీసుకునే ఆహారం కలుషితం కావడం వలన కేన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు. 

కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడం వలన కేన్సర్ నుండి మనలను మనం రక్షించుకుంటామన్నారు. కేన్సర్ పై అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.  ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రసీజర్లలో 400 ప్రొసీజర్లు ఒక్క కేన్సర్ కు సంబంధించినవి ఉన్నాయని, వైద్యానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ మెడికల్ కళాశాలలో కేన్సర్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైజాగ్ లో ఉన్న హోమీ బాబా కేన్సర్ తో ప్రభుత్వం ఎంఒయు చేసుకున్నట్లు తెలిపారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రూ.50 కోట్లతో అధునాతన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.  ముఖ్యమంత్రి ఆలోచనతో ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ కేన్సర్ తో ఎంతో మంది బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆహారం కలుషితం అవుతున్నందు వలన ఎంతో మంది కేన్సర్ కు గరౌతున్నారన్నారు. 

 కేన్సర్ వ్యాధి పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.  కేన్సర్ కు సంబంధించి కెజిహెచ్ లో అధునాతన వైద్య ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్డ్ఎ అధ్యక్షులు అక్కరమాని విజయ నిర్మల, కెజిహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, మహాత్మా గాంధీ కేన్సర్ హాస్పిటల్ ఎండి ఓ. మురళీకృష్ణ, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. వాక్ మారథన్ కార్యక్రమాన్ని బీచ్ లో కాళీమాత టెంపుల్ నుండి వైయంసిఎ వరకు నిర్వహించారు.