చాలా మందికి పెదవులపై నల్లని ట్యాన్ పేరుకుపోయి అందవిహీనంగా తయారవుతాయి. సాధారణ కారణాలు సూర్యరశ్మి, డీహైడ్రేషన్, ధూమపానం, స్పైసీ ఫుడ్ తినడం వంటి అలవాట్ల కారణంగా పెదాలు నల్లబడటానికి దారితీస్తాయి. జీవనశైలిలో కొద్దిపాటి మార్పు చేయడం వల్ల సహజంగా గులాబీ పెదాలను పొందవచ్చు. అదరాలు గులాబీ రంగు పొందాలంటే కొన్ని హో రెమిడీస్ ట్రై చేయడం ద్వారా తిరిగి మళ్లీ అధరాలను గులాబీ రంగులోకీ మార్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. షుగర్ స్క్రబ్ తో పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చక్కెరలో తేనె చుక్కలు కొన్నింటిని వేసి షుగర్ స్క్రబ్ తయారు చేసుకోవాలి. దీనిని పెదాలకు స్క్రబ్‌ని అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు వృత్తాకారంలో మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. షుగర్ స్క్రబ్‌లోని చక్కెర పెదవులపై మృత కణాలను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. తేనె పెదాలను తేమగా ఉంచి, పోషణ అందిస్తుంది.
లిప్ మాస్క్‌లు పెదాలను హైడ్రేట్‌గా ఉంచి పోషణను అందిస్తాయి. మార్కెట్లో ఎన్నో రకాల లిప్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. తేనె, అలోవెరా జెల్, కొబ్బరి నూనెను కలిపి ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసుకోవచ్చు. దీనిని పెదాలపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. లిప్ మాస్క్ పెదాలను మృదు వుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఎపిఎఫ్ తో లిప్ బామ్‌ను ఉపయోగిం చడం వల్ల పెదాలను సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి రక్షించుకోవచ్చు. ఇది పెదాలను పొడిగా చేసి, రంగు మారడానికి కారణమవుతుంది. ప్రతి రోజూ పెదాలకు ఎస్పీఎఫ్ లిప్ బామ్ రాసుకోవడం మర్చిపోకూడదు. పెదాలు మాత్రమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ల తాగాలి. తగినంత నీళ్లు తాగడం వల్ల పెదాలు ఎండిపోకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. వీటిల్లోని పోషకాలు పెదాలను తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవాలి.
తగినంత నిద్ర లేకపోయినా పెదాల పగుళ్లు ఏర్పడి, పొడి బారిపోతుంటాయి. ప్రతి రోజు 7-8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ధూమపానం, సిగరెట్ అలవాటు దూరం చేయడం వల్ల పెదాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధూమపానం చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా పెదవులు పొడిబారతాయి. పెదవులు విపరీతంగా పొడిగా ఉన్నా.. పగిలినట్లు లేదా రంగు మారినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి. అంతర్లీన వైద్య సమస్యల వల్ల కూడా పెదవులు రంగు మారడం మనం గమనించవచ్చు.