తృణ ధాన్యాలతో ధృడమైన ఆరోగ్యం


Ens Balu
30
Vizianagaram
2022-08-25 12:08:31

తృణధాన్యాలు, చిరు ధాన్యాలు ఎన్నోవేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగంగా ఉన్నాయని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తేజస్వి కట్టిమణి పేర్కొన్నారు. సిటియు లో ఈరోజు కేంద్ర విద్యా మంత్రిత్వ సఖ ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ అవగాహనా కార్యక్రమాలలో భాగంగా గురువారం జరిగిన 'తృణ ధాన్యాలు వాటి ప్రయోజనాలు' అనే అంశం పై జరిగిన సదస్సులో వీసీ మాట్లాడారు. ఆధునిక ఆహారవిహారాలు మానజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టి ప్రొసెస్డ్ ఫుడ్, పాలిష్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ని ప్రధాన ఆహారంగా చేసుకొని అనేక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. తినే ఆహారంలో తృణధాన్యాలు చిరు ధాన్యాలను ఎక్కువగా తీసుకొంటె అనారోగ్యాల బారిన పడకుండా చేసుకోవచ్చనని సూచించారు. రాబోయే కాలం లో మానవ మనుగడకు తృణధాన్యాలు ఒక ప్రధాన ఆహారపదార్థంగా మారబోతున్నాయన్నారు. భారతదేశములో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి, గోధుమ, అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు వీటిలోని పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70-80 శాతం ఇస్తాయన్నారు. అంతేకాదు ఇతర పోషకపదార్ధాలైన మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, బికాంప్లెక్స్ విటమిన్లను కూడా అందజేస్తాయని తెలిపారు.  

అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ కె ప్రకాష్ మాట్లాడుతూ, భారత దేశం ప్రపంచం లోనే డయాబెటీస్ కి కేంద్రాం గా ఉందని నిపుణులుహెచ్చరిస్తూనే ఉన్నారని దీనికి ప్రత్యామ్నాయం తృణధాన్యాలు ఆహార పదార్థాలుగా చేర్చుకోవాలని సూచించారు తృణధాన్యాల ఉపయోగాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.   సతీష్ గైక్వాడ్ తాడినేటి మాధవ్ లు వైస్-ఛాన్సలర్ లు రీసెర్చ్ పేపర్ కంపిటేషన్ కి సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.