ఆరోగ్య రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి


Ens Balu
26
Parvathipuram
2022-12-15 09:56:10

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఇన్ ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. దుర్గా కళ్యాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం హెమోగ్లోబిన్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హెమోగ్లోబిన్ పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గా కళ్యాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ హెమోగ్లోబిన్ పరీక్షలు అవసరమన్నారు. హెమోగ్లోబిన్ వలన ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. హెమోగ్లోబిన్ మెరుగు పరుచుటకు గుడ్లు, మాంసాహారం, కేరట్, పచ్చని ఆకుకూరలు, బఠాణీ, చిక్కుడు గింజలు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కె. విజయ గౌరి, రక్త నిధి వైద్యులు డా.వినోద్ తదితరులు పాల్గొన్నారు.