ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్ పథకం జాతీయ ఆరోగ్య రక్షణ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని , ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ బీమా కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ పథకం ద్వారా ఆరోగ్య భీమా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకోవడానికి ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 7,42,629 మంది లబ్ధిదారలు ఉండగా అందులో ఇప్పటివరకు 2,47,162 మందికి మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారని ఇంకా చేయించాల్సిన 4,95,467 మంది ఉన్నారని వీరికి త్వరితగతిన ఈ కేవైసీ పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదవారికి వైద్యం చేయించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.