కాకరను తక్కువగా చేస్తే మీరే నష్టపోతారు..
Ens Balu
2
హెల్త్ డెస్క్
2020-10-20 17:06:17
కాకరకాయా అబ్బో చేదు..తినడం నావల్ల కాదు బాబూ అనేవారందరికీ దీనియొక్క అసలైన ప్రయోజనాలు తెలుసుకుంటే...కాకరకాయతప్పా మరేమీ తినని భీష్మించుకుని కూర్చుంటారు...నమ్మకం లేదా..అయితే ఈ హెల్త్ న్యూస్ కార్డ్ చదవండి.. కాకరకాయను హిందీలో కాకరకయను "కరేలా" అంటారు. ఈ కూరగాయను కాకరకాయ, బిట్టర్ మెలోన్, ఇంగ్లీషులో బిట్టర్ స్క్వాష్ అని పిలుస్తారు. దాని పేరులోనే చేదు ఉందని దాన్ని చూసినప్పుడు నామనసుకు అనిపించే మొదటి విషయం. అది పెరిగే ప్రాంతాన్ని బట్టి ముదురు లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ, అనేక ప్రయోజనాలు కలిగిన ఆక్సీకరణలు, ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటుంది. బిట్టర్ మిలాన్ ని జ్యూస్ లాంటి పానీయంలో, పచ్చళ్ళలో లేదా కొన్ని వంటలు వంటి వివిధ మార్గాలలో ఉపయోగిస్తారు. బిట్టర్ మిలాన్ లో పోషకాహార విలువలు తెలుసుకుంటే.. బిట్టర్ మిలాన్ లో A,B,C వంటి విటమిన్లు, బీటా-కేరొటీన్ వంటి ఫ్లవోనాయిడ్స్, ?-కెరోటిన్, లుటీన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా శాస్వత రుగ్మతలైన ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతమైన చికిత్స కాకరకాయ పనిచేస్తుంది. పైగా లివర్ టానిక్ గా కూడా దీనికి మంచి పేరుంది..రోజూ ఒక గ్లాసు బిట్టర్ మెలోన్ జ్యూస్ తాగితే లివర్ సమస్యలు నయమవుతాయి. ఇలా వారంరోజులు చేసినట్లైతే ఫలితం చక్కగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో పలు రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి మనం చాలా మాత్రలు మింగుతుంటాం కాన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నీటిలో బిట్టర్ మెలోన్ ఆకులు లేదా పండ్లను ఉడికి౦చండి, దీనిని రోజూ తీసుకుంటే అంటురోగాలు రానీకుండా చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తి పెంపొందడానికి ఎంతో సహాయపడుతుంది. ఈరోజుల్లో యుక్త వయస్సు అమ్మాయిలను వేధించే సమస్య మొటిమలు..బిట్టర్ మెలోన్ మొటిమలు, మచ్చలు, చర్మ అంటువ్యాధులను తొలగించుకోవడానికి మిక్కిలిగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంతో కూడిన బిట్టర్ మెలోన్ ని ప్రతిరోజూ పరగడుపున 6 నెలలు తీసుకుంటే, సరైన ఫలితాలు పొందుతారనడంలో ఎలాంటి సందేమూ లేదు.. ప్రస్తుత రోజుల్లో 40 సంవత్సరాలు దాటిన ప్రతీ వ్యక్తినీ ఇబ్బంది పెట్టేది మధుమేహం మన వాడుక భాషలో సుగర్ అంటాం కదా...దానిని అదుపులో పెట్టడానికి బిట్టర్ మెలోన్ రసం 2 వ రకం మధుమేహవ్యాధిని అధిగమించడానికి అత్యంత సాధారణ నివారణ మార్గంగా చెప్పవచ్చు. బిట్టర్ మెలోన్ బ్లడ్ షుగర్ తగ్గించడానికి సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలను కలిగి ఉంటుంది. దీంతో దీనిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కార్యాలయాల్లో కుర్చీలకే అతుక్కుపోయేవారికి ప్రధానంగా వచ్చే సమస్య మలబద్ధకం...దీనితో ఉదయం బాత్ రూమ్ లో కచేరీ చేస్తుంటారు చాలా మంది అలాంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి బిట్టర్ మెలోన్ లో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగించడమే కాకుండా మూత్రపిండాలు, మూత్రాశయంను శుభ్రపరిచి రాళ్లను కరిగిస్తుంది..గుండె జబ్బులను నియంత్రిస్తుంది. బిట్టర్ మెలోన్ అనేక మార్గాలలో గుండెకు చాలా మంచిది. ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి తక్కువగా ఉండడం వల్ల కూడా గుండెను ఆరోగ్య౦గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది రోగం కాన్సర్ అలాంటి మొండి రోగాన్ని కూడా బిట్టర్ మెలోన్ కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి, బరువు తగ్గడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. బిట్టర్ మెలోన్ మీ వ్యవస్థ తాజాగా ఉండడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగిఉంది. ఇది మీ జీవక్రియను, అరుగుదల విధానాన్ని అభివృద్ది చేసి తద్వారా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.