కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి...వంశీ


Ens Balu
1
Visakhapatnam
2020-07-20 20:01:43

విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్ ప్రజల ను కోరారు. సోమవారం ఆయన చినవాల్తేరులో మీడియాతో మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అయినప్పటికీ కొ న్ని ప్రైమరీ కాంటాక్ట్ ల కారణంగా పాజిటివ్ కేసులు అధికం అవుతున్నాయన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ద్వారా ప్రతీరోజూ అన్ని వార్డుల్లో సోడియం హై పో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించడంతోపాటు, బ్లీచింగ్ చైన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అత్యవసర సమయాల్లో తప్పా ఎవరూ బయటకు రావొద్ద ని ఆయన పిలుపునిచ్చారు. అందరూ బయటకు రావడం ద్వారా పాజిటివ్ వున్న వ్యక్తుల ద్వారా మరింత మందికి వైరస్ సోకే ప్రమాదముందని అన్నారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వైరస్ నియంత్రణలో బాగస్వామ్యం కావాలన్నారు.