తోటకూర మేలు తెలిస్తే రోజూ తింటారు..


Ens Balu
1
న్యూస్ డెస్క్
2020-11-24 09:09:09

ఆకుకూరల్లో రారాజు తోటకూర. ఈతోటకూర వలన సహజసిద్ద లాభాలు తెలిస్తే ప్రతీరోజూ తినడానికి అందరూ ఆశక్తి చూపుతారు. రూ.వేలు ఖర్చు చేసి మందులు వేసుకునే కంటే ప్రతీరోజూ 100గ్రాములు తోటకూర తీసుకుంటే వచ్చేలాభాలాంటో మీరు తెలుసుకుంటే.. మాంసకృత్తులు 18గ్రామలు, జీరో కేలరీలు, జీరోఫ్యాట్, ఇక విటమిన్ ల విషయానికొస్తే కంటి చూపుకోసం పనిచేసే ఏ విటమిన్ తోపాటు కే,బి6, రిబోప్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా రక్తహీనత బారిన పడిన వారు నిత్యం తోటకూర తింటే రక్తంలోని హిమోగ్లోబిన్ అమాంతం పెరుగుతుంది. ఆకలి పుట్టించడంతోపాటు, జీర్ణశక్తిని కూడా బాగా పెంపొందిస్తుంది. తోటకూర మంచి విరేచనకారి కూడా పిల్లలకు తోటకూరను రోజూ పప్పులో వేసి పెట్టడం ద్వారా మంచి పోషక విలువలు అందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..