కరోనా రోగుల కోసం హెటిరో మరో శుభవార్త...
Ens Balu
1
Amaravati
2020-07-29 20:03:20
ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో కరోనా మందుకు సంబంధించి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమ్డిసివిర్‌కు జెనిరిక్ మందుగా కోవిఫర్ పేరుతో వయల్స్‌ను(ఇంజెక్షన్స్) అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ మరో ముందడుగు వేసింది. కరోనాకు మందుగా ‘ఫావివిర్’ పేరుతో ట్యాబ్సెట్లను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘ఫావిపిరవిర్’ అనే యాంటీ వైరల్ డ్రగ్ ట్యాబ్లెట్లకు జెనిరిక్ మందుగా ‘ఫావివిర్’ను వినియోగంలోకి తేనున్నట్లు హెటిరో బుధవారం ప్రకటించింది. ‘ఫావివిర్’ పేరుతో అందుబాటులో రానున్న ఈ కరోనా మెడిసిన్ ఒక్కో ట్యాబ్లెట్ ధర 59 రూపాయలుగా నిర్ణయించింది. ‘ఫావిపిరవిర్’ ఉత్పత్తికి, మార్కెటింగ్ చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం కూడా పొందినట్లు హెటిరో స్పష్టం చేసింది.