మెంతులు తింటే కలిగే ఉపయోగాలివే..
Ens Balu
9
హెల్త్ న్యూస్ డెస్క్
2020-12-05 09:25:12
మెంతులు ఇవి తినడానికి కాస్త చేదుగా వున్నా వీటి గుణం మానవ శరీరంపై ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. మెంతులు వలన కలిగే ఉపయోగాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే మెంతులను ప్రతీ ఒక్కరు ఒక మంచి ఆహారంగానూ, మరింత మంచి ఔషదంగానూ వినియోగిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు..మెంతులు తింటే కలిగే ఉపయోగాలేంటో ఇపుడు చూద్దాం.. *మెంతులు కఫాన్ని తగ్గిస్తాయి *గ్యాస్ ట్రిక్ మంటను నియంత్రిస్థాయి *మెంతికూర గుండె జబ్బులను రానీయదు *మెంతులను నానబెట్టుకొని తింటే బరువు తగ్గుతారు *మెంతి పొడి, రసం తలకి రాస్తే చుండ్రు తగ్గుతుంది *బ్లాక్ హెడ్స్ ను తగ్గించాలంటే మెండి పొడిని మొహానికి రాయాలి *ప్రేగులను శుభ్రం చేయడంలో మెండి కూర బాగా పనిచేస్తుంది *మెంతులు నానబెట్టుకొని తింటే రక్త హీనత తగ్గి, ఉబ్బసం, క్షయ రోగాలకు ఎంతో పనిచేస్తుంది. *మెంతులను వేయించి ఆ పొడి తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి *మూలశంఖ ఉన్నవారికి మంచి ఉపసమనం కలిగిస్తుంది *తలకి మెంతిపొడితో పాటు పెరుగును పట్టించి గంట ఆగి తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది కుదుళ్లు గట్టిపడతాయి. *స్త్రీలలో తెల్లబట్ట సమస్య వున్నవారు మెంతులను, పసుపుని సమ భాగాలుగా చేసుకొని వాటిని మరింగించి ఆ నీటితో జననేంద్రియాలను శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. * పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. *2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు. ఇంకా మరెన్నో ఉపయోగాలు మెంతులు, మెంతికూర వలన మనకు కలుగుతాయి.